ETV Bharat / bharat

'యోగిని గోరఖ్​పుర్ మఠానికి పంపేయండి' - హథ్రస్ అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న రాహుల్ ప్రియాంక

ఉత్తర్​ప్రదేశ్​లో జరుగుతున్న వరుస అత్యాచారాలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. జవాబుదారీగా ఉండాలని యోగి సర్కార్​ను డిమాండ్ చేశాయి. యూపీలోని ఆటవిక రాజ్యానికి ఎలాంటి హద్దులు లేవని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. మరణించిన తర్వాత కూడా మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. యోగి ఆదిత్యనాథ్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపించేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.

opposition parties leaders hit out yogi govt in up over arising of continuous rape cases
'యోగిని గోరఖ్​పుర్ మఠానికి పంపించేయండి'
author img

By

Published : Oct 1, 2020, 1:11 PM IST

Updated : Oct 1, 2020, 1:17 PM IST

హాథ్రస్ ఘటన జరిగి రోజులు గడవక ముందే ఉత్తర్​ప్రదేశ్​లో వరుస అత్యాచార ఘటనలు వెలుగులోకి రావడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. బలరాంపుర్ జిల్లాలో 22 ఏళ్ల దళిత యువతిపై జరిగిన దారుణాన్ని తీవ్రంగా ఖండించాయి.

ఇదీ చదవండి- యూపీ​లో ఘోరం.. మరో రెండు 'నిర్భయ' ఘటనలు

ఉత్తర్​ప్రదేశ్​లో ఉన్న 'ఆటవిక రాజ్యానికి ఎలాంటి హద్దులు లేవు' అని కాంగ్రెస్ విమర్శించింది. యోగి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేశారు. ఆదిత్యనాథ్​ పాలనలో మహిళలపై దురాగతాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఉత్తర్​ప్రదేశ్​ ఆటవిక రాజ్యంలో మహిళలపై అకృత్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతోంది. మహిళలు ప్రాణాలతో ఉన్నప్పుడు గౌరవం ఇవ్వలేదు. మరణించిన తర్వాత కూడా గౌరవం దక్కనివ్వలేదు. ఆడపిల్లలను కాపాడాలన్నది భాజపా నినాదం కాదు. నిజాలు దాచి, అధికారాన్ని కాపాడుకోవాలనేదే వారి నినాదం."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

హాథ్రస్​లో జరిగిన క్రూరమైన ఘటన బలరాంపుర్​లోనూ జరిగిందని, ఆటవిక రాజ్యానికి హద్దులు లేవని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ఆజాంఘర్, బాఘ్​పట్, బులంద్​షహర్​లో బాధితురాళ్లను చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

"యూపీలో ఆటవిక రాజ్యం వ్యాప్తికి హద్దులు లేవు. ప్రచారాలు, ప్రసంగాల ద్వారా శాంతి భద్రతలను నెలకొల్పలేము. ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి జవాబుదారీగా ఉండేందుకు ఇదే సరైన సమయం. ప్రజలు జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నారు."

-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ఉత్తర్​ప్రదేశ్​లో చట్టం ఇంకా బతికే ఉందా అని యోగి సర్కార్​ను కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నది రాజ్యాంగ ప్రభుత్వమా, లేదా నేరస్థుల ప్రభుత్వమా అంటూ ఎద్దేవా చేశారు.

పరామర్శ...

హాథ్రస్​ సామూహిక అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పరామర్శించనున్నారు. ఇరువురు నేతలు హాథ్రస్​కు రానున్నట్లు యూపీ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ లలన్ కుమార్ తెలిపారు. వీరికి ఆహ్వానం పలికేందుకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఘజియాబాద్​కు చేరుకున్నారని వెల్లడించారు.

అయితే, హాథ్రస్​లో శాంతి భద్రతలకు విఘాతం తలెత్తకుండా ఉండేందుకు జిల్లా సరిహద్దులను మూసేయాలని స్థానిక మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. 144 సెక్షన్​ ప్రయోగించారు.

మాటలు రావడం లేదు: మమత

హాథ్రస్ సామూహిక అత్యాచార ఘటన అనాగరికమే కాక సమాజానికి సిగ్గుచేటని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

"హాథ్రస్​లో దళిత యువతిపై జరిగిన అనాగరికమైన, అవమానకరమైన ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదు. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండానే అంత్యక్రియలు నిర్వహించడం సిగ్గుచేటు."

-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

మఠానికి పంపించేయండి!

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సైతం యోగి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. మహిళలకు రక్షణ కల్పించలేకపోతే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యోగి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి(గోరఖ్​నాథ్ మఠం)కి పంపించేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ ప్రదేశం నచ్చకపోతే అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలైనా అప్పగించాలన్నారు.

అయితే, బలరాంపుర్​ ఘటనలో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి అంత్యక్రియలను బుధవారం పూర్తి చేసినట్లు చెప్పారు.

Last Updated : Oct 1, 2020, 1:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.