నిర్బంధ కశ్మీర్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలకు విముక్తి కల్పించాలని కోరాయి.
ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, పౌర హక్కులపై దాడులు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా విపక్ష నేతలు ఆరోపించారు.
'ఈ దాడులతో అసమ్మతిని, విమర్శించే గొంతులనూ నొక్కేస్తున్నారు. ఆంక్షల పేరుతో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను ఏడు నెలలుగా నిర్బంధించడమే దీనికి ఉదాహరణ.'
- విపక్ష నేతలు.
జాతీయ ప్రయోజనాలు, శాంతిభద్రతల దృష్ట్యా ముగ్గురు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులను ప్రభుత్వం నిర్బంధంలో ఉంచింది. ఈ ఆరోపణలకు విశ్వసనీయమైన ఆధారాలేవని విపక్ష నేతలు ప్రశ్నించారు. మోదీ సర్కారు నియంతృత్వ పాలనతో ప్రజాస్వామ్య గళాన్ని నొక్కేస్తోందని ఆరోపించారు.
విపక్షాల డిమాండ్‌కు మాజీ ప్రధాని దేవెగౌడ, బంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ సహా.. సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు పలికారు.
ఇదీ చదవండి: జమ్మూలో ఎన్కౌంటర్... ఇద్దరు ముష్కరులు హతం