ETV Bharat / bharat

'చమురు ధరలు పెంచితే సామాన్యుడి పరిస్థితి ఏంటి?'

లోక్​సభలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా పెట్రోల్​, డీజిల్​పై సుంకాల పెంపును తీవ్రంగా విమర్శించాయి విపక్షాలు. అది సగటు మనిషికి పెను భారంగా మారుతుందని పేర్కొన్నాయి. తక్షణమే సుంకాల పెంపు ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్​ నేత శశి థరూర్​ డిమాండ్​ చేశారు.

'చమురు ధరలు పెంచితే సామాన్యుడి పరిస్థితి ఏంటీ?'
author img

By

Published : Jul 8, 2019, 9:37 PM IST

Updated : Jul 8, 2019, 11:35 PM IST

పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. 2019-20 వార్షిక బడ్జెట్​పై లోక్​సభలో చర్చ సందర్భంగా ధరల పెంపును తీవ్రంగా తప్పుపట్టాయి. సుంకాల పెంపు సామాన్య మానవునిపై పెను భారంగా మారుతుందని పేర్కొన్నాయి. తక్షణమే సుంకాల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశాయి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ... దేశంలో పెట్రోల్​, డీజిల్​పై సుంకాలు ఎందుకు పెంచారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత శశి థరూర్​.

లోక్​సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్​ సీనియర్​ నేత శశి థరూర్​

"ఈ ప్రభుత్వం విధించిన పన్నుల వల్ల సామాన్య ప్రజలు ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక చమురు ధరలు చెల్లిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గుతున్నప్పటికీ... మన ఆర్థిక మంత్రి లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై మరో 2 రూపాయల భారాన్ని మోపారు."

- శశి థరూర్​, కాంగ్రెస్​ నేత.

జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి...

పెట్రోల్​, డీజిల్​ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు డీఎంకే నేత టీఆర్​ బాలు. వెంటనే సుంకాల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. పెట్రోల్​, డీజిల్​ల​ను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలన్నారు.

మోదీ 2.0 ప్రభుత్వంలో తొలి బడ్జెట్​ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్...​ పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం, రోడ్లు- మౌలిక వసతుల సుంకాన్ని లీటర్‌కు రూ.2 అదనంగా పెంచారు. ఈ నిర్ణయంతో పెట్రోల్​ ధర దాదాపు లీటర్​కు రూ.2.40, డీజిల్​ లీటర్​కు రూ.2.36 మేర పెరిగింది.

ఇదీ చూడండి: మసీదుల్లో మహిళల ప్రవేశంపై వ్యాజ్యం కొట్టివేత

Digital Advisory
Monday 8th July 2019
Clients, please note that the usage restrictions for highlights and player reactions from Wimbledon 2019 are now the following:
SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Scheduled news bulletins only. Maximum use 2 minutes per day in no more than three scheduled news programmes. Use within 24 hours. Broadcasters are not allowed to attach a sponsor's name to their bulletin. Mandatory on-screen display of the AELTC Championships logo. No archive. No Internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
The restrictions on our individual digitally-cleared daily wraps are unchanged.
Regards,
SNTV London
Last Updated : Jul 8, 2019, 11:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.