ETV Bharat / bharat

మోదీ 'ఎన్​ఆర్​సీ' వ్యాఖ్యలపై విపక్షాల విమర్శలు - congess news

దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీని చేపట్టడంపై ఏనాడూ కేంద్ర ప్రభుత్వం చర్చించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొనటంపై తీవ్ర విమర్శలు చేశాయి విపక్ష పార్టీలు. ప్రధాని, హోంమంత్రి మధ్య సరైన అవగాహన లేదని పేర్కొన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని ఇప్పుడు అసత్యాలు చెబుతున్నారని ఆరోపించాయి. ప్రధాని చెప్పింది నిజమైతే.. వెంటనే పౌర చట్టాన్ని రద్దు చేసి.. ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​ ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్​ చేశాయి. విపక్షాల విమర్శల నేపథ్యంలో ఎన్​ఆర్​సీకి మద్దతుగా నిలిచారు మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​.

nationwide NRC
మోదీ 'ఎన్​ఆర్​సీ' వ్యాఖ్యలపై విపక్షాల విమర్శలు
author img

By

Published : Dec 24, 2019, 5:21 AM IST

Updated : Dec 24, 2019, 7:14 AM IST

మోదీ 'ఎన్​ఆర్​సీ' వ్యాఖ్యలపై విపక్షాల విమర్శలు

దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్​ఆర్​సీ) చేపట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చర్చించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానిచటంపై విమర్శలు గుప్పించాయి విపక్ష పార్టీలు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని పేర్కొన్నాయి. ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రధాని అసత్యాలు చెబుతున్నారని ఆరోపించాయి.

మోదీ వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి..

మోదీ వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత శరద్​ పవార్​. దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అమలుపై ప్రభుత్వ ప్రణాళిక గురించి పార్లమెంటు​ సంయుక్త సమావేశం ప్రసంగంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ కూడా ప్రస్తావించినట్లు పేర్కొన్నారు పవార్​. ప్రధాన పాలసీని తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వ స్థాయిలో దానిపై చర్చ జరుగుతుంది.. చర్చ లేకుండా దేశం ముందుకు రాలేదన్నారు. పార్లమెంటు​ సాక్షిగా దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ చేపడతామని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నట్లు గుర్తు చేశారు.

దేశ ప్రజలను మోసగిస్తున్నారా?..

ప్రధాని మోదీ దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్​. ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్​ఆర్​సీని భాజపా పేర్కొందని.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కూడా ఈ విషయాన్ని పలు సందర్భాల్లో స్పష్టం చేశారని పేర్కొంది. కానీ.. దానికి విరుద్ధంగా ప్రధాని మాట్లాడుతున్నారని విమర్శించింది. ప్రధాని, హోంమంత్రి మధ్య సామరస్యం లేదా? అధికారం, సంస్థల మధ్య విభేదాలు ఉన్నాయా? లేదా ఇద్దరు కలిసి దేశ ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారా? అని ప్రశ్నించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.

ఎన్​ఆర్​సీ ప్రయత్నాలను ఆపండి..

ఎన్​ఆర్​సీపై ప్రధానమంత్రి మోదీ అసత్యాలు చెబుతున్నారని ఆరోపించాయి వామపక్ష పార్టీలు. పౌర చట్టం, పౌర జాబితాపై ఆందోళనలతో ప్రధాని గందరగోళ పరిస్థితికి లోనయ్యారని విమర్శిచాయి. 2019 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ చేపడతామని హామీ ఇచ్చిందని గుర్తుచేసింది సీపీఎం. ఎవరు అబద్దాలు చెబుతున్నారో మోదీ వ్యాఖ్యలతోనే స్పష్టంగా తెలిసిపోతుందని పేర్కొన్నారు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా. ఒకవేళ ప్రధాని చెప్పింది నిజమైతే ఎన్​ఆర్​సీ​ ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని, సీఏఏ రద్దు, ఎన్​ఆర్​సీ దేశవ్యాప్తంగా అమలును నిలిపివేయాలని డిమాండ్​ చేశారు.

పూర్తి చర్చల అనంతరం చేపట్టాలి..

దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అంశంలో మోదీ వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు విమర్శలు చేస్తోన్న క్రమంలో ఎన్​ఆర్​సీకి మద్దతుగా నిలిచారు మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత శివరాజ్​ సింగ్​ చౌహాన్​. అయితే.. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ చేపట్టిన అనంతరం దేశవ్యాప్తంగా చేపట్టాలని అభిప్రాయపడ్డారు. పౌరచట్టంపై దేశ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్​ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఇదీ చూడండి: ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి జయభేరి

AP Video Delivery Log - 2100 GMT News
Monday, 23 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2057: US CA Fallen Tree Rescue KTTV - Must credit KTTV Fox 11 News, No access Los Angeles, No use US broadcast networks, No re-sale, re-use or archive 4246120
Man rescued from beneath large fallen tree
AP-APTN-2035: Ivory Coast Soro AP Clients Only 4246119
Ivory Coast protests after Soro flight diverted
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 24, 2019, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.