తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత నివాసమైన వేద నిలయాన్ని ఆమె స్మారక కేంద్రంగా మార్చింది అక్కడి ప్రభుత్వం. గురువారం చెన్నైలో ఈ స్మారక కేంద్రాన్ని నిరాడంబరంగా ప్రారంభించారు సీఎం కే పళని స్వామి.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం, శాసనసభ స్పీకర్, ఏఐఏడీఎంకే మంత్రులు పాల్గొన్నారు. జయలలిత చిత్రపటానికి నివాళులర్పించారు.
మరోవైపు.. స్మారక కేంద్ర ప్రారంభోత్సవాన్ని ఆపాల్సిందిగా మద్రాస్ హైకోర్టులో జయలలిత మేనల్లుడు దీపక్, మేనకోడలు దీప వేసిన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది న్యాయస్థానం. స్మారక కేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. అయితే.. అప్పుడే ప్రజల సందర్శనకు అవకాశం కల్పించొద్దని తెలిపింది.
ఇదీ చూడండి: జయలలిత ఇల్లు స్వాధీనం కోసం ఆర్డినెన్స్