బిర్యానీ అంటే మీకు ఇష్టమా? ఫుడ్ డెలివరీ యాప్‌ల్లో ఆర్డర్ చేస్తుంటారా? మరి మీ కోసం ఓ స్పెషల్ బిర్యానీ ఉంది. ధర రూ.40 వేలు మాత్రమే. అవాక్కయ్యారా...! తొందరపడకండి... ముందు ఆ కథేంటో తెలుసుకోండి..!
ప్రియ.... ఓ కాలేజీ స్టూడెంట్. చెన్నైలోని షావుకారుపేటలో ఉంటోంది. ఆమె సెల్‌ఫోన్ చూస్తుండగా ఓ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 76 రూపాయలకే బిర్యానీ అందిస్తామని ఊరించింది. అది చూసి ప్రియ... బిర్యానీ ఆర్డర్ చేసింది.
ఎంతసేపు వేచి ఉన్నా బిర్యానీ మాత్రం రాలేదు. యాప్ వాళ్లకు ఫోన్‌చేసి.. తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరింది ప్రియ. రూ.76 తక్కువ మొత్తం కనుక ఆన్లైన్లో రిటర్న్ చేయలేమని వాళ్లు అన్నారు. రూ.5 వేలు నగదు జమచేస్తే... తిరిగి రూ.5,076 ఒకేసారి పంపిస్తామని నమ్మబలికారు.
అది నమ్మిన ప్రియ రూ.5 వేలు పంపింది. అయినా వాళ్లు డబ్బులు పంపించలేదు. మరింత నగదు జమచేయాలని కోరారు. అలా ఆమె నుంచి రూ.40 వేలు దోచుకున్నారు. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న ప్రియ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదీ చూడండి: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్- నలుగురు నక్సల్స్ హతం