కరోనా దృష్ట్యా శబరిమలలో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఉంటుందని చెప్పారు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్.వాసు. శబరిమలలో ఆన్లైన్ దర్శనం సాధ్యపడదని స్పష్టం చేశారు. ఈ విధానం అనేక వివాదాలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. దర్శనానికి రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులకే అనుమతి ఉంటుందన్నారు.
"పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతి ఉంటుంది. ఆన్లైన్ దర్శనం లేదు. సాధారణ రోజుల్లో వెయ్యి మంది భక్తులను అనుమతిస్తాం. శని, ఆది వారాల్లో ఆ సంఖ్యను రెండు వేలకు, మండల పూజ దినాల్లో ఐదు వేలకు పెంచుతాం. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి కొవిడ్ పరీక్ష నిర్వహిస్తాం. "
..ఎన్.వాసు, ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు ఛైర్మన్