ETV Bharat / bharat

'ఫస్ట్​బెల్​'లో 1000 కొట్టిన కేరళ

కరోనా సంక్షోభంలో విద్యార్థుల అమూల్యమైన సమయాన్ని నష్టపోకుండా కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్​లైన్​ తరగతుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది.

Online classes in Kerala cross 1000-mark
'ఫస్ట్​బెల్​'లో 1000 కొట్టిన కేరళ
author img

By

Published : Jul 27, 2020, 5:21 PM IST

దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ నేపథ్యంలో పాఠశాలలు మూతపడ్డాయి. అయితే విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగకుండా... కేరళ ప్రభుత్వం జూన్​ 1న 'ఫస్ట్​ బెల్'​ పేరుతో రాష్ట్ర అధికారిక ఛానెల్​ కైట్​ (కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్​ అండ్​ టెక్నాలజీ ఫర్​ ఎడ్యుకేషన్) విక్టర్స్​​ ద్వారా వర్చువల్​ తరగతులను ప్రారంభించింది. ప్రస్తుతం వాటి సంఖ్య 1000 దాటింది.

'ఫస్ట్​ బెల్'​ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 604 ఆన్​లైన్​ క్లాసులను ప్రసారం చేసినట్లు కైట్​-విక్టర్స్​​ పేర్కొంది. కన్నడ మాధ్యమంలో 274, తమిళంలో 163 క్లాసులు ప్రసారం చేసినట్లు వెల్లడించింది.

విద్యార్థులకు అందుబాటులో

టీవీ, స్మార్ట్​ఫోన్​, ఇంటర్నెట్, కంప్యూటర్​లో ఈ తరగతులను వీక్షించవచ్చని ఉపాధ్యాయులు తెలిపారు. విక్టర్స్​ వెబ్​సైట్​, మొబైల్​ యాప్​, సోషల్​ మీడియా పేజీల్లోనూ చూడొచ్చని పేర్కొన్నారు. www.facebook.com/victerseduchannel లింక్​ సహాయంతో ఫేస్​బుక్​లైవ్​ ద్వారా కూడా ఆన్​లైన్​ పాఠాలకు హాజరు కావచ్చని చెప్పారు. ఒకవేళ ఈ తరగతులకు హాజరు కాలేని విద్యార్థులు ప్రత్యమ్నాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు.

అవకాశం లేకపోతే..

ఆన్​లైన్​ తరగతులు చూసే సౌకర్యంలేనివారు 2 లక్షల మందికి పైగా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించిందని అధికారులు తెలిపారు. అలాంటివారు తమ పొరుగువారు, దగ్గరలో ఉన్న స్నేహితులు ఇళ్లల్లో, లైబ్రరీలు, అక్షయ కేంద్రాలకు వెళ్లి... తరగతులకు హాజరు కావాలని సూచించారు.

ఇదీ చూడండి: కరోనా ఉన్నా ఆ రాష్ట్రంలో విద్యా సంవత్సరం షురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.