ETV Bharat / bharat

కరోనా గుప్పిట్లో భారత్‌ విలవిల

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. రోజు వారి కొత్త కేసుల సంఖ్య తొలిసారి ఏడు వేల మార్కును దాటింది. మొత్తం కేసుల సంఖ్య 1.65 లక్షలు దాటింది. కేసులు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్​ 9వ స్థానానికి చేరింది.

Ongoing corona intensity in the country
కరోనా గుప్పిట్లో భారత్‌ విలవిల
author img

By

Published : May 30, 2020, 6:56 AM IST

దేశంలో కరోనా ఉద్ధృతికి తెరపడట్లేదు. తొలిసారి కొత్త కేసులు ఏడు వేల మార్కును దాటాయి. 24 గంటల్లో ఏకంగా 7,466 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దీంతో బాధితుల మొత్తం సంఖ్య 1.65 లక్షలు దాటింది. కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో టర్కీని దాటి 9వ స్థానానికి భారత్‌ చేరింది. తాజాగా 24 గంటల్లో దేశంలో 175 మంది మహమ్మారి దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల విషయంలో మన దేశం(4,706) చైనాను దాటేసింది.

ఈనెలలో దేశంలో ఇప్పటివరకు సగటున రోజుకు 4,558 కేసులు వెలుగుచూశాయి. అమెరికా, బ్రెజిల్‌, రష్యా తర్వాత రోజువారీ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశం మనదే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే ఉద్ధృతి కొనసాగితే కొవిడ్‌ బాధితుల సంఖ్య విషయంలో భారత్‌ త్వరలోనే ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా దిల్లీలో తొలిసారి 24 గంటల్లో వెయ్యికిపైగా కేసులు వచ్చాయి. అక్కడ శుక్రవారం 13 మంది మరణించారు. దేశ రాజధానిలో గత 34 రోజుల్లో సంభవించిన మరో 69 మరణాలను కూడా తాజాగా కరోనా లెక్కల్లో చేర్చారు. దాదాపుగా ప్రతిరోజు మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు తమిళనాడులో నమోదవుతుండగా, తాజాగా ఆ స్థానాన్ని దిల్లీ భర్తీ చేసింది. రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌లలో కొత్తగా 300 మందికిపైగా కరోనా పాజిటివ్‌గా తేలారు. 24 గంటల్లో 12 రాష్ట్రాల్లో 175 మంది చనిపోయారు. తాజా మరణాల్లో 48% మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. కేరళలో తాజాగా 84 కొత్త కేసులు వచ్చాయి. అక్కడి పరిస్థితులపై సీఎం పినరయి విజయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తమ రాష్ట్రం సామాజిక సంక్రమణం అంచునకు చేరిందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికంటే, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారి ద్వారానే ఎక్కువ సంక్రమణ జరుగుతోందని అన్నారు. రాజ్యసభ సచివాలయంలో పనిచేసే ఇద్దరు అధికారులకు కరోనా సోకడంతో పార్లమెంటు అనుబంధ భవనంలో రెండు అంతస్థులను మూసివేసినట్లు తెలిసింది

corona
శుక్రవారం నమోదైన కేసుల వివరాలు

వారు ప్రయాణాలు చేయొద్దు: గోయల్‌

శ్రామిక్‌ రైళ్లలో పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకోవాలని రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ విజ్ఞప్తిచేశారు. రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే హెల్ప్‌లైన్‌ నంబర్లయిన 139, 138కి ఫోన్‌ చేయాలని సూచించారు.

corona
రాష్ట్రాల వారిగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.