ETV Bharat / bharat

వ్యవసాయ సదుపాయాలకు ఒక్క శాతం వడ్డీకే రుణాలు

ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద కేటాయించిన రూ. లక్ష కోట్లను వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పేరిట వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఒక్క శాతం వడ్డీకే రుణాలిచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఒక్కో సంఘానికి గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకూ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

One per cent interest loans for agricultural facilities
వ్యవసాయ సదుపాయాలకు ఒక్క శాతం వడ్డీకే రుణాలు
author img

By

Published : Aug 4, 2020, 7:55 AM IST

Updated : Aug 4, 2020, 11:04 AM IST

దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి.. ప్రయోగాత్మకంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్‌)కు అతి తక్కువగా ఒక్క శాతం వడ్డీకే రుణాలిచ్చేందుకు రంగం సిద్ధమైంది. గ్రామాల్లో వ్యవసాయ, మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు ఖర్చుచేయాలి. ఒక్కో సంఘానికి గరిష్ఠంగా రూ.2కోట్ల వరకూ ఇవ్వాలని నిర్ణయించారు. కొవిడ్‌ సంక్షోభంలో వ్యవసాయానికి ఉద్దీపన కోసం 'ఆత్మ నిర్భర్‌ భారత్‌' పథకం కింద కేంద్రం రూ.లక్ష కోట్లను కేటాయించింది. వీటిని 'వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి' పేరిట వెచ్చించాలని నిర్ణయించింది. మూడేళ్ల(2020-23)లోగా దేశంలోని అన్ని ప్యాక్స్‌కు రుణం అందజేయాలని బ్యాంకులన్నింటికీ సూచించింది. ఈ క్రమంలో నాబార్డు ద్వారా ఈ నిధిని రుణాలుగా ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్యాక్స్‌కు ప్రత్యేకంగా రూ.5000 కోట్లు కేటాయించారు. తెలంగాణలో మొత్తం 905 ప్యాక్స్‌ ఒక్కోటీ రూ.2 కోట్ల వంతున గరిష్ఠంగా రూ.1810 కోట్ల రుణాలు పొందడానికి అవకాశముంటుంది.

ఏయే పనులకిస్తారంటే...

  • రుణాలు పొందడానికి నాబార్డు కొన్ని సూచనలిచ్చింది. ప్రతీ సంఘం తన పరిధిలోని గ్రామాల ప్రజలకు సేవలన్నీ అందించే 'బహుళ సేవా కేంద్రం'(ఎంఎస్‌సీ)గా మారవచ్చు. ఉదాహరణకు లైసెన్సులుంటే పెట్రోలు బంకు, గ్యాస్‌ ఏజెన్సీ వంటివి పెట్టుకోవచ్చు. వ్యవసాయోత్పత్తులు, నిత్యావసర వస్తువుల తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాలు ప్రారంభించవచ్చు.
  • రైతుల పంటలను పొలం వద్దనే కొని శుద్ధి, నిల్వ చేసి తిరిగి అమ్ముకునే గ్రామీణ మార్కెట్‌ కేంద్రంగా సదుపాయాల కల్పనకు రుణం ఇస్తారు. ఉదాహరణకు వనపర్తి జిల్లాలో వేరుసెనగ బాగా పండుతుంది. అక్కడే నూనె మిల్లు, విత్తన శుద్ధి కేంద్రం పెట్టి ఆ ఉత్పత్తులను ప్యాక్స్‌ సొంత బ్రాండుతో అమ్ముకోవచ్చు.
  • ప్రతి జిల్లాలో డిమాండున్న పంటల కొనుగోలు, శుద్ధి కేంద్రాలతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ప్లాంట్లు పెట్టవచ్చు. రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పూల పంటలు ఎక్కువ. అక్కడ శీతల గిడ్డంగులు పెట్టి పంటలను గ్రేడింగ్‌, శుద్ధి చేసి విదేశాలకు అమ్ముకునేందుకు ప్యాక్‌హౌస్‌లు నిర్మించుకోవచ్చు.
  • నీటి, భూసార పరీక్షల, పాల శీతలీకరణ కేంద్రాలు, కాయలను పండ్లుగా మార్చే మాగపెట్టే కేంద్రాలు...ఇలా ఏది అవసరమున్నా నిర్మించడానికి రుణం ఇస్తామని నాబార్డు రాష్ట్ర చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ యడ్ల కృష్ణారావు ‘ఈనాడు’కు చెప్పారు. ప్యాక్స్‌కు ఇంత ఉదారంగా రూ.2కోట్ల రుణాలివ్వడం ఇదే తొలిసారని, సంఘాలు సద్వినియోగం చేసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను ఎంతగానో మెరుగుపరచవచ్చని ఆయన సూచించారు.

ఎలా ఇస్తారంటే...

  • నాబార్డు రాష్ట్ర సహకార బ్యాంకులకు 3 శాతం వడ్డీకి నిధులిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు(టీఎస్‌ క్యాబ్‌) శాఖలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల(డీసీసీబీ) శాఖల ద్వారా వాటిని ప్యాక్స్‌కు 4 శాతానికి రుణాలుగా అందజెయ్యాలి. ఈ ప్రక్రియను నిర్వహించినందుకు ఒక శాతం సొమ్మును సహకార బ్యాంకులు రుసుముగా తీసుకుంటాయి.
  • ప్రతీ సంఘం రుణంతో నిర్మించిన నిర్మాణాలపై వచ్చే ఆదాయంతో ఏడేళ్లలోగా అప్పును తిరిగి చెల్లించాలి. ఇలా చేస్తే ఆత్మ నిర్భర్‌ కింద అవి చెల్లించే 4 శాతంలో 3 శాతం వడ్డీని రాయితీగా కేంద్రం భరిస్తుంది. అంటే చివరికి ఒక్క శాతానికే రుణం పొందినట్లవుతుంది.
  • కేంద్ర పథకాల కింద ప్యాక్స్‌ రుణాలు పొందాలంటే ప్రాజెక్టు వ్యయంలో 10 శాతాన్ని సంఘం వాటాగా పెట్టాలి. కానీ కొన్ని సంఘాల ఆర్థిక పరిస్థితి బాగా లేనందున ఈ శాతానికి సగానికి సగం తగ్గించి 5 శాతమే తీసుకోవాలని నాబార్డు నిర్ణయించింది.

Last Updated : Aug 4, 2020, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.