ఉగ్రవాదులు కశ్మీర్లోని ఇతర రాష్ట్రాల వారిని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా సోఫియాన్ జిల్లాలో ఇద్దరు పండ్ల వ్యాపారులపై కాల్పులు జరిపారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మూడు రోజుల క్రితం ఓ ట్రక్కు డ్రైవర్ను కాల్చి చంపిన ఘటన మరువకముందే మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు ముష్కరులు.
షోపియన్ జిల్లాలో సాయంత్రం 7.30 గంటల సమయంలో చరణ్జిత్ సింగ్, సంజీవ్ అనే ఇద్దరు పండ్ల వ్యాపారులపై ముష్కరులు కాల్పులు జరిపారు. దాడి నుంచి తప్పించుకొని గాయాలతో పూల్వామా జిల్లాలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : సేన యువనేతకు మున్నాభాయ్ మద్దతు