ETV Bharat / bharat

నీటి ద్వారా కొత్త వ్యాధి- కేరళలో ఒకరు మృతి

కరోనా వ్యాప్తి తగ్గకముందే కేరళలో మరో వ్యాధి సంక్రమిస్తోంది. కొజికోడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు 20 మందికి 'షిగెల్లా వ్యాధి' లక్షణాలు కనిపించాయని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యాధి కారణంగా ఒకరు మృతిచెందినట్లు వెల్లడించారు.

one died off Shigella infection reported in Kozhikode of Kerala
షిగెల్లా వ్యాధితో కేరళలో ఒకరు మృతి
author img

By

Published : Dec 20, 2020, 1:26 PM IST

కేరళలోని కొజికోడ్ జిల్లా వాసులను షిగెల్లా వ్యాధి వణికిస్తోంది. కొట్టంపరంబ, ముందిక్కల్​తాజం ప్రాంతాల్లో దాదాపు 20 మందిలో ఈ కొత్త వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఈ వ్యాధి కారణంగా ఒకరు మృతిచెందినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జిల్లా మెడికల్​ అధికారి (డీఎంఓ) సూచించారు. కొజికోడ్ ప్రాంతంలోని నీటి సాంపిల్స్​ను పరీక్షించేందుకు ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు.

వ్యాధి సంక్రమణ దృష్ట్యా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు జిల్లా అధికారులు. ఇంటింటికీ తిరిగి వ్యాధి గురించి ప్రజలకు వివరించాలని కోరారు. స్థానిక బావుల్లో, నీటి కొళాయిల్లో క్లోరినేషన్​ చేయాలని ఆదేశించారు. అంగన్​వాడీ కేంద్రాల ద్వారా ఓఆర్​ఎస్​లు అందించాలని చెప్పారు.

షిగెల్లా వ్యాధి లక్షణాలు:

  • జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట మొదలైనవి షిగెల్లా వ్యాధి ప్రథమ లక్షణాలు.
  • కలుషిత నీరు, పాడైన ఆహారం సేవించడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది.
  • ఈ వ్యాధి సంక్రమణ ఐదేళ్లలోపు పిల్లలకు ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
  • షిగెల్లా వైరస్​ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. వ్యాధిగ్రస్తుడితో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కాంటాక్ట్​లోకి వస్తే వ్యాధి సోకే అవకాశాలు ఎక్కుగా ఉంటాయి .
  • 2 నుంచి 7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం పట్టొచ్చు.

వ్యాధి సోకకుండా తీసుకొవాల్సిన జాగ్రత్తలు:

  • కాచిచల్లార్చిన నీరు మాత్రమే తాగాలి.
  • తరచుగా.... సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • మంచి ఆహారం సేవించాలి.
  • బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయకూడదు.
  • ఉపయోగించిన డైపర్లను సరైన పద్ధతిలో పడేయాలి.
  • వ్యాధి లక్షణాలు ఉన్నవారు వంటలు చేయకూడదు.
  • నీటిని, ఆహార పాత్రలను మూతలతో కప్పి ఉంచాలి.
  • విరేచనాలు ఉన్న పిల్లలను ఇతరులతో కలవనివ్వకూడదు.
  • వ్యాధిగ్రస్తులతో కలవకపోవడం శ్రేయస్కరం.
  • వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఓఆర్​స్, ఉప్పు ద్రావణం, కొబ్బరి నీరు వంటివి తాగి రీహైడ్రేట్ చేసుకోవాలి.

ఇదీ చదవండి:రైతులకు మద్దతుగా టాటూ ఆర్టిస్టుల స్టాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.