ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: ఎటు చూసినా భయం- అంతా నిర్మానుష్యం - punjan corona

భారత్​లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకు భారత్​లో​ 258 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాయి. ఫలితంగా జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

One day before the 'Janata curfew' in the country
దేశంలో 'జనతా కర్ఫ్యూకు' ఒక రోజు ముందు
author img

By

Published : Mar 21, 2020, 11:26 AM IST

Updated : Mar 21, 2020, 5:55 PM IST

కరోనా ఎఫెక్ట్​: ఎటు చూసినా భయం- అంతా నిర్మానుష్యం

భారతీయులను కరోనా వైరస్​ తీవ్రంగా కలవరపెడుతోంది. ప్రజలు వైరస్​ బారినపడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. దీని వల్ల దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. రోడ్లపై ప్రజలు కనపడటం లేదు. కరోనా వల్ల వేసవి సెలవులు నెలరోజులు ముందుగానే వచ్చినట్టు అయ్యింది.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విపరీతంగా ప్రబలుతోంది. ఇప్పటి వరకు 63 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఒకరు మరణించారు. అప్రమత్తమైన ఉద్ధవ్​ ఠాక్రే ప్రభుత్వం మార్చి 31 వరకు ముంబయి, పుణె, నాగ్​పుర్ సహా ప్రధాన నగరాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ కార్యాలయాలన్నీ మూసివేయాలని నిర్ణయించింది. కేవలం నిత్యవసర దుకాణాలు, అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

నాగపుర్​లో బహిరంగ ప్రదేశాలను ప్రజలు ఖాళీ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీనితో ఆ నగర రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. లోకమాన్య తిలక్ టెర్మినస్​ వద్ద ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు గుమిగూడారు. అయితే రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టికెట్ కన్​ఫర్మ్​ అయినప్పటికీ​ సీటు లభించని పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిల్లీలో...

కరోనా ముప్పును దృష్టిలో ఉంచుకొని దిల్లీలోని అన్ని మాల్స్​ను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శుక్రవారం ప్రకటించారు. కిరాణా, ఔషధ దుకాణాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనితో దిల్లీలో జనజీవనం స్తంభించింది. రోడ్లపై ప్రజలు కనపడటం లేదు.

పంజాబ్​లో

కరోనాతో పంజాబ్​లో ఓ వ్యక్తి గురువారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో పంజాబ్​ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. అంతర్రాష్ట్ర బస్సు సేవలను నిలిపివేసింది.

జమ్ముకశ్మీర్​లో

జమ్ముకశ్మీర్​లో ఇప్పటి వరకు నలుగురు కరోనా బారిన పడ్డారు. ఈ మహమ్మారి మరింత విజృంభించకుండా అధికారులు శ్రీనగర్ మార్కెట్లను మూసివేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ప్యూ పాటించనున్నారు దేశప్రజలు. ఇప్పటికే నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నారు.

ఇదీ చూడండి: దేశంలో 258కి చేరిన కరోనా కేసుల సంఖ్య

Last Updated : Mar 21, 2020, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.