ETV Bharat / bharat

పోలీసు చెక్​పాయింట్​ వద్ద గ్రెనేడ్​ దాడి.. ఒకరు మృతి - పోలీసు చెక్​పాయింట్​ వద్ద గ్రెనేడ్​ దాడి.. ఒకరు మృతి

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లోని ఎంఆర్​ గంజ్​ సమీపంలో పోలీసు చెక్​ పాయింట్​ వద్ద గుర్తు తెలియని ఉగ్రవాది గ్రెనేడ్​ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

grenade attack in Kashmir
పోలీసు చెక్​పాయింట్​ వద్ద గ్రెనేడ్​ దాడి
author img

By

Published : Mar 6, 2020, 10:52 PM IST

Updated : Mar 6, 2020, 11:59 PM IST

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మహరాజ్​ గంజ్​ పోలీస్​ స్టేషన్​ సమీపంలోని పోలీసు చెక్​పాయింట్​ వద్ద గ్రెనేడ్​ దాడి చేశారు. ఈ దుర్ఘటనలో స్థానిక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసు చెక్​ పాయింట్​ వద్ద రోడ్డు పక్కన గ్రెనేడ్​ పేలినందున ఇద్దరు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. అయితే.. క్షతగాత్రులను స్థానిక ఎస్​ఎంహెచ్ఎస్​ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించే క్రమంలో ఒకరు మృతి చెందారని మరొకరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.

కాల్పుల్లో మరొకరు మృతి

పుల్వామా జిల్లాలోని త్రాల్​ నగరంలో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు షబిర్​ అహ్మద్​ భట్​ గా గుర్తించారు పోలీసులు. అతను స్థానికంగా వాహనాల క్రయవిక్రయాల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ప్రతి 10మంది మహిళల్లో 8మందికి ఫోన్లో వేధింపులు

Last Updated : Mar 6, 2020, 11:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.