భారత దేశమంతటా స్వాతంత్ర వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఒక్కొక్కరూ తమ మదిలో ఉన్న దేశ భక్తిని ఎలుగెత్తి చాటుతున్నారు. పంద్రాగస్టుకు తోడు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పూర్ణిమ ఈరోజే కావడం విశేషం.
ప్రముఖ సైకత శిల్పి మానస్ సాహూ ఈ రెండు పండుగల విశిష్టతను ప్రతిబింబించేలా కళాకృతిని రూపొందించారు. ఒడిశాలోని పూరీ సముద్రతీరాన ఇసుక తెన్నెలపైన రక్షా బంధన్‌కు భారత చిత్రపటాన్ని జోడించి అద్భుతమైన కళను ప్రదర్శించారు.
ఇదీ చూడండి:నరేంద్ర మోదీ పంద్రాగస్టు ప్రసంగం హైలైట్స్.