మధ్యప్రదేశ్‌లోని బాలలు మాత్రం తల్లితో పాటు తమ జిల్లా మొత్తాన్నే మురిసేలా చేశారు. 1128 మంది చిన్ని కృష్ణులు కలిసి ఆ జిల్లాకు ప్రపంచ రికార్డు తెచ్చి పెట్టారు.
జబువా జిల్లా రాజ్‌బాడాలోని ఓ విద్యా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో 1128 మంది పిల్లలు బాల కృష్ణుడి వేషధారణలో ఒకే చోట సమావేశమయ్యారు. ఇంతమంది ఒకేసారి పట్టుపీతాంబరాలు ధరించి సందడి చేసినందుకు గోల్డెన్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆ జిల్లా పేరు నిలిచింది.
బాల కృష్టులను చూసేందుకు వేలాది మంది ప్రజలతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. గిరిజనులు ఎక్కువగా ఉన్న జబువా జిల్లాను మొదటిసారిగా ఇలా ప్రపంచ రికార్డు వరించినందుకు, జిల్లా ప్రజలంతా ఈసారి పండుగను మరింత ఘనంగా జరుపుకుంటున్నారు.
"చాలా మంది కృష్ణ వేషధారణలో నిలిచినందుకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో వారి పేరు నిలిచింది. ఇదివరకు బెంగళూరులో 997 మంది కృష్ణ వేషధారణలో మెరిసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇప్పుడు జబువా బాలలు ఆ రికార్డు బద్దలు కొట్టారు. అది కూడా 1128 మందితో రికార్డు బ్రేక్ చేశారు."
-డాక్టర్ మనీష్ విష్ణోయ్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి
ఇదీ చూడండి:గలగలల దాల్ సరస్సు కళ తప్పెనే!