ETV Bharat / bharat

ఒక్కడి వల్లే 2 యుద్ధాలు! - మసూద్

మౌలానా మసూద్​ అజార్​. కరడుగట్టిన ఉగ్రవాది. భారత్​లో జరిగిన అనేక ఉగ్రదాడులకు మూలం అతడే. అతడు స్థాపించిన జైషే మహ్మద్. ఆ సంస్థ మూలంగానే... గత 20 సంవత్సరాల్లో భారత్​, పాకిస్థాన్​ రెండు సార్లు యుద్ధానికి దగ్గరగా వెళ్లొచ్చాయి.

మసూద్​
author img

By

Published : Mar 3, 2019, 6:02 PM IST

Updated : Mar 3, 2019, 6:34 PM IST

పాకిస్థాన్​ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్​ గత 20 సంవత్సరాల్లో రెండు సార్లు భారత్​-పాకిస్థాన్​లను యుద్ధం ముంగిట్లో నిలబెట్టింది.
2001లో భారత్​ పార్లమెంటుపై జైషే ఉగ్రవాదులు దాడి చేసినప్పడు భారత్​-పాక్​ దాదాపు యుద్ధానికి దగ్గరగా వెళ్లాయి. ఇటీవల 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్​ బస్సుపై చేసిన దాడితో రెండు దేశాల మధ్య మరోమారు అదే పరిస్థితి ఏర్పడింది.

నిఘా వర్గాల దగ్గరున్న సమాచారం ప్రకారం.... ఈ తీవ్రవాద సంస్థ 2017 నవంబర్​ 27న పాకిస్థాన్​లోని ఒకరా జిల్లాలో సమావేశం అయింది. ఇరు దేశాల సంబంధాలతో నిమిత్తం లేకుండా భారత్​లో దాడులు కొనసాగించాలని తీర్మానించింది.

గత రెండు దశాబ్దాల్లో జైషే ఉగ్రసంస్థ చేసిన ఘాతుకాల్లో పఠాన్​కోట్​ వైమానిక స్థావరం, ఉరీ, జమ్ముకశ్మీర్​ ఆసెంబ్లీ దాడులు ఉన్నాయి. జైషే మహ్మద్​కు ఆల్​ఖైదా సంస్థతో పాటు, ఒకప్పటి దాని అగ్రనేత ఒసామా బిన్​ లాడెన్​తో దగ్గరి సంబంధాలు ఉండేవి.

విమాన హైజాక్​తో మొదలు...

1999 డిసెంబర్​ 34న ఇండియన్​ ఎయిర్​లైన్స్​ విమానాన్ని హైజాక్​ చేశారు ఉగ్రవాదులు. ప్రయాణికులను విడిపించేందుకు 1999 డిసెంబర్​ 31న మసూద్​ అజార్​తో పాటు బ్రిటీష్​ సీక్రెట్​ సర్వీసెస్​కు చెందిన ఒమర్​ షేక్​ను విడుదల చేసింది భారత​ ప్రభుత్వం. వాల్​ స్ట్రీట్​ జర్నల్​ ప్రతినిధి డేనియల్​ పెర్ల్​ను 2002 జనవరిలో హత్య చేయటం సహా అమెరికాలో 9/11 దాడులకు లక్ష డాలర్లు సమకూర్చాడు షేక్​.

హైజాక్​ ఘటన అనంతరమే జైషే మహ్మద్​ను మసూద్​ అజార్​ స్థాపించాడు. ఈ ఉగ్రసంస్థ 2000, 2001 సంవత్సరాల్లో జమ్ముకశ్మీర్​లో వరుస దాడులు చేసింది.
2000 ఏప్రిల్​లో మసూద్​ ముఠా చేసిన దాడిలో 30 మంది సైనికులు మరణించారు. 2000 జూన్​లో శ్రీనగర్​లోని ఒక బస్టాండు వద్ద ముగ్గురు పోలీసులు, 2001 అక్టోబర్​ 1న జమ్ముకశ్మీర్​ అసెంబ్లీపై బాంబు దాడి చేసి 31 మందిని పొట్టనపెట్టుకుంది జైషే మహ్మద్​. 2001 డిసెంబర్​ 13న భారత్​ పార్లమెంటుపై చేసిన దాడిలో 9 మంది మరణించారు.

undefined

లాడెన్​ కోసమే దాడి...

అమెరికాలో 9/11 దాడులు జరిగిన 3 వారాల్లోనే జమ్ముకశ్మీర్​ అసెంబ్లీపై దాడి జరిగింది. అఫ్గానిస్థాన్​లోని టోరా బోరా గుహల్లో ఉన్న బిన్​ లాడెన్​ అమెరికా సైన్యం నుంచి తప్పించుకున్న వారం రోజులకు భారత పార్లమెంటుపై దాడి జరిగింది.

ఈ గుహలకు ఒకవైపు నుంచి పాకిస్థాన్​ సైన్యం పహారా ఉంది. అల్​ఖైదాకు చెందిన వారందరినీ పాకిస్థాన్​లో జైషే, లష్కరే తొయిబా అధీనంలో ఉన్న స్వర్గధామాలకు తరలించటంలో జైషే మహ్మద్​ కీలకంగా వ్యవహరించింది. 9/11 దాడుల సూత్రదారుల్లో ఒకడైన ఖలీద్​ షేక్​ మహ్మద్​ ఆల్​ఖైదా సభ్యులకు కరాచీలో ఆశ్రయం కల్పించాడు.

టోరా బోరా గుహల్లో నుంచి లాడెన్​ తరలివెళ్లేందుకు వీలుగా జైషే మహ్మద్​ భారత్​ పార్లమెంటుపై దాడి చేసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ సంఘటనతో సరిహద్దుకు ఇరు దేశాల సైన్యం తరలివెళ్లింది. దీంతో పాకిస్థాన్​ పశ్చిమ సరిహద్దు వద్ద పహారా తగ్గిపోయింది. ఇక్కడే ఉన్న టోరా బోరా గుహల్లో నుంచి అల్​ఖైదా పాకిస్థాన్​కు సురక్షితంగా తరలివెళ్లింది.
ఈ సంఘటన అనంతరం లాడెన్​ను కనిపెట్టటానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇది జైషేకు ఉన్న సామర్థ్యమని నిపుణుల విశ్లేషణ. అల్​ఖైదా మన దేశంలో ప్రత్యక్ష దాడులు చేయలేదు. కానీ ఉగ్రవాదాన్ని పరోక్షంగా ప్రోత్సహించింది.

ద్వేషమే ఆయుధం...

మసూద్​కు భారత్​ అంటే విపరీతమైన ద్వేషం. అదే ద్వేషాన్ని జైషే మహ్మద్​ సభ్యుల్లో నూరిపోసేవాడు. భారత్​పై దాడులు చేసేలా శిక్షణ ఇచ్చేవాడు.

Intro:Body:Conclusion:
Last Updated : Mar 3, 2019, 6:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.