లాక్డౌన్తో సతమతమవుతున్న వలస కార్మికుల కష్టాలను తీర్చడానికి ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడుపుతోంది కేంద్రం. అయితే తమ రాష్ట్రం వైపుగా దూసుకొస్తున్న తుపాను దృష్ట్యా రైళ్లను రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరింది ఒడిశా ప్రభుత్వం.
ఆదివారం నుంచి తుపాను ప్రభావం మరింత పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లలాకు నడుపుతున్న ప్రత్యేక శ్రామిక్ రైళ్లను తాత్కాలికం నిలిపివేయాలని కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబాను కోరారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకే త్రిపాఠి.
"రాబోయే తుపాను దృష్ట్యా 3 నుంచి 4 రోజులు శ్రామిక్ రైళ్లు రాకపోకలు నిలిపివేయాలని కోరాం. లేకపోతే ఇది పరిపాలనాపరమైన సమస్యలతో పాటు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుంది. అంతేకాకుండా కొవిడ్-19 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళ్లడంలో సమస్యలను సృష్టిస్తుంది." -పీకే జేనా, స్పెషల్ రిలిఫ్ కమిషనర్.
తుపాను అనంతరం..
'పశ్చిమ, దక్షిణ, ఇతర ప్రాంతాల నుంచి శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా ఒడిశాకు వచ్చే ప్రయాణీకులు వారి రాకపై నిర్బంధ కేంద్రాల్లో ఉండాల్సి ఉంటుంది. తుపాను ముగిసిన తర్వాత వారి స్వస్థలాలకు తరలిస్తాం' అని జెనా తెలిపారు.
ఇదీ చూడండి: ఆ 700 మంది సూపర్ స్ప్రెడర్స్కు కరోనా పాజిటివ్