ఒడిశా జర్సుగూడ జిల్లా బేల్పహర్ వద్ద ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు వాహనాన్ని వేగంగా వస్తున్న ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరో 17 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
జర్సుగూడ జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బందోబస్తు కోసం వెళ్తోన్న పోలీసు వ్యాను ప్రమాదానికి గురయింది. ఆ సమయంలో 33 మంది పోలీసుల వ్యాన్లో ఉన్నారు.