ఒడిశా సంబల్‌పుర్‌లోని సపలహార గ్రామానికి చెందిన ప్రకాశ్ అనే యువకుడు అంధుడే అయినా.. సంగీత వాద్యాలను అద్భుతంగా వాయిస్తాడు. చేత్తో వాయించడమే కాదు నోటితోనూ అచ్చం అవే శబ్దాలు చేస్తూ సంగీతాన్ని ఆలపిస్తాడు. అంతే కాదు పక్షుల శబ్దాలూ చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.
ప్రకాశ్‌లో అరుదైన ప్రతిభ దాగి ఉంది. అంధుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న తనకు జ్ఞాపకశక్తి ఎక్కువే. ఐదేళ్ల వయసు నుంచే ప్రముఖ సంబల్పురి పాటలను కంఠస్థం చేసి పాడుతూ ఉండేవాడు. ఇప్పుడు నేపథ్య సంగీతాన్నీ నోటితో పలికిస్తున్నాడు అందరి మనసులు దోచుకుంటున్నాడు.
16 ఏళ్ల ప్రకాశ్‌కు పుట్టుకనుంచే కంటిచూపు లేకపోయినా ఎవరి జాలీ, సాయం కోరడు. ఒక్కడే.. వీధుల్లో ధైర్యంగా నడుస్తాడు. మొబైల్ ఫోన్ కూడా ఉపయోగిస్తాడు. పేదరికంలో పుట్టినా.. పాటలే ప్రాణంగా పెరిగిన ప్రకాశ్ ప్రతిభకు మంచి గుర్తింపు రావాలని ఆశిస్తున్నారు కుటుంబసభ్యులు.
ఇదీ చూడండి:అందాలు చూపిన డేగ.. అపాయం గుర్తు చేసింది!