ఒడిశా గవర్నర్ గణేశీ లాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. భార్యకు, నలుగురు కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ప్రస్తుతం అందరూ భువనేశ్వర్‌లోని ఎస్యూఎమ్ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని గవర్నర్ తెలిపారు. తన కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉన్న వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
గవర్నర్ కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్ చేశారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.
ఇదీ చదవండి:ఝార్ఖండ్‌లో నలుగురు నక్సల్స్ అరెస్టు