దిల్లీ సరిహద్దు ప్రాంతం గాజియాబాద్‌లో పొగ మంచు కారణంగా పదులో సంఖ్యలో వాహనాలు ఢీ కొన్నాయి. తూర్పు ఎక్స్‌ప్రెస్ రహదారిలో జరిగిన ఈ ఘటనలో ఒకరు చనిపోగా 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
జలంధర్ నుంచి వస్తున్న బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. దాని తరువాత వరుసగా పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. బస్సులో ఉన్న కొందరికి గాయాలయ్యాయి. కాగా అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్లనే బస్సు ప్రమాదానికి గరైనట్లు తెలుస్తోంది. పొగమంచు బాగా కమ్ముకున్న సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: దేశ రాజధానిని కమ్మేసిన పొగ మంచు