దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 96,551 కేసులు బయటపడ్డాయి. మరో 1,209 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 45 లక్షల 62 వేలు దాటింది. అయితే ఇప్పటివరకు 35 లక్షల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు. 9 లక్షల 43వేల మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

100శాతం రికవరీ రేటు..
గత కొన్నిరోజులుగా కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ... గడిచిన 29 రోజుల్లో రికవరీ రేటు 100శాతం పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మరణాల రేటు 1.67శాతానికి క్షీణించగా... రికవరీ రేటు 77.65 శాతంగా ఉంది.

గురువారం ఒక్కరోజే 11 లక్షల 63వేల 542మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 5 కోట్ల 40 లక్షల 98 వేలకు చేరువైంది.
ఇదీ చూడండి: ఒకేసారి నలుగురు బిడ్డలకు తల్లయింది!