ETV Bharat / bharat

'అణు బొమ్మ'ల పేరిట దోపిడీ - బొమ్మలు

అరుదైన రేడియోధార్మిక పదార్థాల పేరుతో ప్రజలకు రూ.కోట్లలో టోకరా వేసింది ఓ​ ముఠా. చివరకు జైపూర్​ పోలీసులకు చిక్కింది.

అణు బొమ్మ
author img

By

Published : Mar 10, 2019, 3:55 PM IST

స్కీముల పేరిట స్కాములు చేసిన వారిని చూశాం. నకిలీ బంగారం, దొంగనోట్లు అంటగడుతూ ప్రజలను మోసం చేసే వారినీ చూశాం. కానీ అత్యంత విలువైన, అరుదుగా లభించే రేడియోధార్మిక పదార్థాల పేరిట కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ముఠాను చూశారా? ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రేడియోధార్మిక పదార్థంపై పెట్టుబడి పెట్టి వందల కోట్లు సంపాదించొచ్చని ప్రజలను మోసం చేస్తోందో ముఠా. దీని నెట్​వర్క్​ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ ముఠా గుట్టు రట్టు చేశారు రాజస్థాన్​లోని జైపూర్​ పోలీసులు. 18 మందిని అదుపులోకి తీసుకున్నారు.

"బొమ్మ" చూపిస్తారు:

ముంబయిలో రెన్​సెల్​ ఇండియా అనే నకిలీ సంస్థను నడుపుతున్న గణేశ్​ ఇంగోలే ఆధ్వర్యంలో ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తోంది. అంతర్జాతీయ అణు సంస్థలతో అనుంబంధం ఉందంటూ గణేశ్​, అతని భాగస్వామి సత్యనారాయణ ప్రజల్ని నమ్మించారు. డీఆర్​డీఓ గుర్తింపు పొందిన అరుదైన రేడియోధార్మిక పదార్థంతో చేసిన "డాన్సింగ్​ డాల్​" తమ దగ్గరుందని చెప్పారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ బొమ్మను అధిక ధరకు కొనుగోలు చేస్తుందని నమ్మించారు.

గణేశ్​ మాటలు నమ్మి... పుణెకు చెందిన ముగ్గురు మోసపోయారు. ఏకంగా రూ.7కోట్లు సమర్పించుకున్నారు.

పరీక్షించడానికి రూ.70 లక్షలు:

కొనుగోలు చేసే ముందు రేడియోధార్మిక పదార్థాన్ని పరీక్ష చేయించుకోమని సూచించింది గణేశ్​ ముఠా. ఇందుకు డీఆర్​డీఓ శాస్త్రవేత్త పేరిట ఓ వ్యక్తిని పరిచయం చేసింది. అతడు పరీక్షించి, ధ్రువపత్రం ఇచ్చేందుకు రూ.70లక్షలు వసూలు చేసింది.

దర్యాప్తు ముమ్మరం:

మోసపోయిన వారిలో ఒకరు జైపూర్​ జవహర్​ నగర్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు... గణేశ్​ ముఠాలో 18మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో జైపూర్​, దిల్లీ, ముంబయి, ఇండోర్​, ఉత్తర్​ప్రదేశ్​కు చెందినవారు ఉన్నారు.

అణు బొమ్మతో మోసం

AP Video Delivery Log - 0900 GMT News
Sunday, 10 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0732: NKorea Kim Voting No access North Korea 4200026
Kim Jong Un casts ballot in elections
AP-APTN-0730: In Air Turbulent Flight UGC Must credit: Sead Nikaj 4200025
Video shows passengers on flight after turbulence
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.