ETV Bharat / bharat

సరిహద్దులో పరిస్థితిపై అజిత్ డోభాల్ సమీక్ష - జనరల్ అధికారుల భేటీ మోల్డో

ప్యాంగాంగ్​ లోయలో ప్రస్తుత పరిస్థితిపై జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ సమీక్ష నిర్వహించారు. తాజా పరిణామాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్​నాథ్ సైతం అత్యున్నత సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

NSA Doval reviews situation at India-China border
సరిహద్దులో పరిస్థితిపై అజిత్ డోభాల్ సమీక్ష
author img

By

Published : Sep 1, 2020, 2:14 PM IST

సరిహద్దులో ప్రస్తుత పరిస్థితిపై భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ సమీక్ష నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉన్నతాధికారులతో సమావేశమై ప్యాంగాంగ్​లో పరిణామాలపై చర్చించినట్లు వెల్లడించాయి.

రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సైతం ఈరోజు అత్యున్నత సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

బ్రిగేడియర్ కమాండర్ చర్చలు

మరోవైపు భారత సైన్యానికి చెందిన బ్రిగేడియర్ కమాండర్, చైనా సైన్యంలోని అదే హోదా అధికారితో జరుపుతున్న చర్చలు కొనసాగుతున్నాయి. చుశుల్/మోల్డో ప్రాంతంలో ఈ సమావేశం జరుగుతోంది. ప్యాంగాంగ్​ లోయ దక్షిణ ఒడ్డులో పరిస్థితిపై అధికారులు చర్చిస్తున్నారు.

యథాతథ స్థితి మార్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించడం వల్ల సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. శాంతి నెలకొల్పాలని చేపట్టిన చర్యలకు విఘాతం కలిగించేలా 'హద్దు'లు మీరుతోంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.