ETV Bharat / bharat

దిల్లీ భద్రతా పరిస్థితులపై అజిత్​ డోభాల్ సమీక్ష​ - దిల్లీ భద్రతా పరిస్థితులు

ఈశాన్య దిల్లీలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత పరిస్థితుల్ని స్వయంగా పర్యవేక్షించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​. పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాఫ్రాబాద్​ మెట్రో స్టేషన్​, మౌజ్​పుర్​ చౌక్​ వద్ద నిరసనలు తగ్గుముఖం పట్టాయన్నారు దిల్లీ పోలీస్​ స్పెషల్​ కమిషనర్​ సతీశ్​ గోల్చా.

NSA Doval reviews security arrangements, visits violence-affected areas in North-East Delhi
దిల్లీ భద్రతా పరిస్థితులపై అజిత్​ డోభాల్ సమీక్ష​
author img

By

Published : Feb 26, 2020, 5:42 AM IST

Updated : Mar 2, 2020, 2:39 PM IST

మంగళవారం అర్ధరాత్రి దాటాక దిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​. భద్రతా పరిస్థితులపై దిల్లీ సీలంపుర్​ డీసీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అనంతరం.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్ని సందర్శించారు. సీలంపుర్​, జాఫ్రాబాద్​, మౌజ్​పుర్​, గోకుల్​పురి చౌక్​లలో పరిస్థితుల్ని పరిశీలించారు.

నూతనంగా నియమితులైన దిల్లీ పోలీస్​ స్పెషల్​ కమిషనర్​(శాంతి భద్రతలు) శ్రీవాత్సవ, ఇతర సీనియర్​ స్థాయి పోలీస్​ అధికారులు డోభాల్​తో సమావేశంలో పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లు, పోలీస్​ బలగాల మోహరింపుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నిరసనకారులు వెనక్కి...

పౌర చట్టంపై కొనసాగుతున్న ఆందోళనలు జాఫ్రాబాద్​, మౌజ్​పుర్​లో తగ్గుముఖం పట్టాయని అన్నారు దిల్లీ పోలీస్​ స్పెషల్​ కమిషనర్​ సతీశ్​ గోల్చా. జాఫ్రాబాద్​ మెట్రో స్టేషన్​, మౌజ్​పుర్​ చౌక్​ నుంచి నిరసనకారులు వెనుదిరిగారని స్పష్టం చేశారు.

ఈశాన్య దిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాలు ఈనెల 23న చేపట్టిన ఆందోళనలతో ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ హెడ్​ కానిస్టేబుల్​ కూడా ఉన్నారు.

Last Updated : Mar 2, 2020, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.