జాతీయ పౌర రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ) తుది జాబితాపై అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. జాబితాలో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన శరణార్థుల పేర్లు లేవని అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిలో చాలా మంది.. 1971కి ముందు నుంచే ఇక్కడ నివాసముంటున్నారని చెప్పారు. ఈ విషయంపై వరుస ట్వీట్లు చేశారు హిమంత.
-
#NRCAssam
— Himanta Biswa Sarma (@himantabiswa) August 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Names of many Indian citizens who migrated from Bangladesh as refugees prior to 1971 have not been included in the NRC because authorities refused to accept refugee certificates. Many names got included because of manipulation of legacy data as alleged by many 1/2
">#NRCAssam
— Himanta Biswa Sarma (@himantabiswa) August 31, 2019
Names of many Indian citizens who migrated from Bangladesh as refugees prior to 1971 have not been included in the NRC because authorities refused to accept refugee certificates. Many names got included because of manipulation of legacy data as alleged by many 1/2#NRCAssam
— Himanta Biswa Sarma (@himantabiswa) August 31, 2019
Names of many Indian citizens who migrated from Bangladesh as refugees prior to 1971 have not been included in the NRC because authorities refused to accept refugee certificates. Many names got included because of manipulation of legacy data as alleged by many 1/2
"బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు 1971 ముందే వలస వచ్చిన శరణార్థుల పేర్లు ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో లేవు. వారు చూపిన ధ్రువపత్రాలను అధికారులు తిరస్కరించారు. తప్పుడు వివరాల కారణంగా చాలా మంది అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయని ఆరోపణలొస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినతి చేసినట్లు బంగ్లా సరిహద్దు జిల్లాల్లో 20 శాతం, మిగతా జిల్లాల్లో 10 శాతం మంది పేర్లను మళ్లీ పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అనుమతివ్వాలి."
-హిమంత ట్వీట్.
ఏఏఎస్‌యూ అసంతృప్తి
ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో పేర్లు లేని వారి సంఖ్యపై అసంతృప్తిని వ్యక్తం చేసింది అఖిల అసోం విద్యార్థి సంఘం(ఏఏఎస్‌యూ). సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించింది. ఎన్‌ఆర్‌సీ ముసాయిదాలో 41 లక్షల మందిని విదేశీయులుగా పేర్కొనగా తుది జాబితాలో వారి సంఖ్య 19 లక్షలకు తగ్గింది. అనర్హుల సంఖ్యపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఏఏఎస్‌యూ నేతలు... నవీకరణ ప్రక్రియ సాగిన తీరుపై పెదవి విరుస్తున్నారు. ఎన్‌ఆర్‌సీ తుది జాబితాను అసంపూర్ణ ప్రక్రియగా పేర్కొన్నారు.
జాబితాలో చోటు సంపాదించిన అనర్హులను తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపింది ఏఏఎస్‌యూ. అసోంలోకి ప్రవేశించిన విదేశీయులను తరలించాలంటూ 1979 నుంచి ఆరేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపింది. 1985లో ఇతర అసోమీ జాతీయవాద సంఘాలతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అసోం ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇదీ చూడండి: పేరు ఫ్రాన్సెస్కా.. ఊరు రొమేనియా.. పూజలు శివునికి!