ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో కరోనాపై పోరాటానికి మరమనిషి - మరమనిష

ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్​ను అరికట్టేందుకు వైద్యులు ప్రాణాలకు తెగించి నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ.. వైద్యులను కూడా ఈ మహమ్మారి వదలట్లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగుల చికిత్సలో వైద్యులకు సహాయంగా కేరళలో ఓ రోబోను ఉపయోగిస్తున్నారు. బాధితులకు ఆహారం, ఔషధాలను చకచకా సరఫరా చేసేస్తోంది ఈ మరమనిషి.

Now, robot is part of Kerala's fight against coronavirus
ఆ రాష్ట్రంలో కరోనాపై పోరాటానికి మరమనిషి
author img

By

Published : Apr 22, 2020, 6:29 AM IST

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు సేవలందిస్తున్నారు వైద్య సిబ్బంది. కుటుంబాలను వదిలి కంటికి కనిపించని శత్రువుతో నిత్యం పోరాటం చేస్తున్నారు. వీరికి అండగా కేరళ ఆరోగ్యశాఖ సహకారంతో ఓ ఇంజనీరింగ్​ కళాశాల విద్యార్థులు రూపొందించిన రోబో సేవలను వినియోగిస్తున్నారు. ఐసోలేషన్​ వార్డులో ఉన్న రోగులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేసేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు.

కేరళలో సేవలు..

చైనాలోనే కాదు కేరళలోనూ కరోనా సోకిన వారికి వైద్య సేవలు అందిస్తోంది ఓ రోబో. నైటింగేల్​-19 అనే ఈ రోబో కన్నూర్​ జిల్లా అంకరకాండిలోని కరోనా బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేస్తుంది. అంతేకాకుండా బాధితులను ఆరోగ్య కార్యకర్తలతో పాటు అవసరమైతే వారి బంధువులతో మాట్లాడేందుకు నైటింగేల్​-19 ఎంతో సహకరిస్తుంది.

చకచకా ఈ పనులు

ఆరోగ్యశాఖ సహకారంతో చెబేరి విమల్​ జ్యోతి ఇంజనీరింగ్​ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఈ రోబోను రిమోట్​ కంట్రోల్​ ద్వారా ఆపరేట్​ చేయొచ్చు. ఈ రోబో ఒక్కసారి ఆరుగురు వ్యక్తులకు ఆహారం, మంచినీరు, మందులు అందిస్తుంది. కిలోమీటరు పరిధిలో తిరిగే ఈ రోబో ప్రతి గదిలోకి వెళ్లి ఆహారం, ఔషధాలు, కావల్సిన వాటిని అందిస్తుంది. తర్వాత శుభ్రం చేస్తుంది కూడా. కొవిడ్​పై పోరాటానికి దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ రోబోలను ఉపయోగించారు.

ఇదీ చదవండి: కంగారుపడొద్దు.. కనిపెట్టుకుంటూ ఉండండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.