"గత ఐదేళ్ల నుంచి ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ ఆలోచనలపై పోరాటం చేస్తున్నాం. వారి ఆలోచనల్లోని అంతరార్థం కేవలం ఒకే వ్యక్తి దేశాన్ని పాలించాలనే. ఆర్ఎస్ఎస్ తన ఆలోచనలను మనపై ఎందుకు రుద్దుతుందో మీరే చెప్పాలి. దక్షిణ భారత గళాన్ని వినిపించాలనే అమేఠీతో పాటు వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నా. మీ మాట ఎవరికన్నా తక్కువ కాదు. రాజకీయ నాయకుల్లా అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పడానికి ఇక్కడికి రాలేదు. నా మనసులో మాటను చెప్పను. మీ మనసులోని వాటిని అర్థం చేసుకోవడానికే వచ్చాను. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు.
ప్రధానమంత్రిలా 2 కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పడానికి వయనాడ్కు రాలేదని చెప్పారు రాహుల్. ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇవ్వాలనుకోవట్లేదని నొక్కి చెప్పారు కాంగ్రెస్ అధ్యక్షుడు.