ETV Bharat / bharat

'అందరికీ వ్యాక్సిన్ అవసరం లేదు' - కరోనా టీకా వార్తలు

దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కరోనాతో అధిక ముప్పు ఎదుర్కొం టున్న వారికి మాత్రమే ఇస్తే సరిపోతుందని నిపుణలు అంటున్నారు. ఈ మేరకు 7 రాష్ట్రాలకు చెందిన నిపుణలు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అలా ఆదా అయ్యే డబ్బుతో దేశంలో వైద్య ఆరోగ్య వ్యవస్థను అధునాతనంగా తీర్చిదిద్దాలని కోరారు.

VACCINE
వ్యాక్సిన్
author img

By

Published : Nov 25, 2020, 7:16 AM IST

కరోనా వ్యాక్సిన్ అందరరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని 7 రాష్ట్రాలకు చెందిన ప్రజా వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంగళవారం లేఖ రాశారు. ఇలా ఆదా ఆయిన డబ్బుతో దేశంలో వైద్య ఆరోగ్య వ్యవస్థను అధునాతనంగా తీర్చిదిద్దడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

దీనిపై సంతకం చేసిన వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ ఆర్. శ్రీవాత్సవ్ ఉన్నారు.

"సురక్షిత, సమర్థమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కొవిడ్ నుంచి అధికముప్పు ఎదుర్కొంటున్న కొద్ది మందికి అందిస్తే సరిపోతుంది. మిగతా ప్రజలందరూ తమను తాము రక్షించు కోవడానికి ఔషధేతర విధానాలను తప్పనిసరిగా ఆనుసరించేలా, ఆసుపత్రి అవసరమైన వారికి నాణ్యమైన వైద్యం అందేలా చూస్తే సరిపోతుంది. సరైన వైద్యసేవలు లేకపోవడం వల్లే ఎక్కువ శాతం మరణాలు సంభవించినట్లు మా దగ్గరున్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది. అందువల్ల అవసరమైన వారికి మాత్రమే టీకా అందించి, తద్వారా ఆదా అయిన డబ్బును ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగించాలి.

ప్రతి జిల్లాలో కనీసం 700 పడకలతో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రులతో కూడిన వైద్యకళాశాలలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల కరోనాను ఎదుర్కోవడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారులనైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి.

ఒకవేళ మొత్తం జనాభాకు వ్యాక్సిన్ వేసినా రోగం కనుమరుగయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మందులు అవసరమవుతాయి. అందువల్ల కొత్త ఔషధాలు కనిపెట్టడానికి ప్రభుత్వ పెట్టబడులు అవసరం అవుతాయి."

-నిపుణుల అభిప్రాయం

వ్యాక్సిన్ దుష్ప్రభావాన్ని పర్యవేక్షించాలని కేంద్రం లేఖ

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ఎవరిలోనైనా దుష్ప్రభావం మొదలైతే దానిని పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఈ నెల 18న రాసిన లేఖలో సూచించింది. జిల్లాల్లో కరోనా వ్యాక్సిన్‌ను వేయడం ప్రారంభించడానికి ముందే ఇది జరిగేలా చూడాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కోరింది. గుండెపోటు, పక్షవాతం వంటి ఇతర అనారోగ్యాలతో మరణించినా కరోనా వైరస్ కారణంగానే జరిగిందని భావించే ప్రమాదం ఉన్న దృష్ట్యా ఈ తేడాను స్పష్టంగా గర్తించేలా కమిటీల్లో ఏయే రంగాల నిపుణులు ఉండాలో తెలిపింది. జిల్లాలోని డ్రగ్ ఇన్ స్పెక్టర్లు కూడా సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. సరిపడా అడ్రినలైన్ ఇంజక్షన్లు నిల్వ చేసుకోవాలని సూచించింది. సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ భద్రతపై ఎలాంటి వదంతులు, తప్పుడు వార్తలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది.

ఇదీ చూడండి: కరోనా టీకా పంపిణీకి సిద్ధమవ్వండి: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.