ETV Bharat / bharat

ప్యాంట్​లో100 టీ షర్టులను​ దాచాడు.. వీడియో వైరల్​ - latest national news

తమిళనాడులోని ఓ గార్మెంట్​ ఫ్యాక్టరీ ఉద్యోగి చేసిన నిర్వాకం అక్కడి సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఉద్యోగానికి వచ్చే ముందు మామూలుగా ఉన్న అతడు వెళ్లేటప్పడు మాత్రం లావుగా అయ్యాడు. సూపర్​వైజర్​కు అనుమానం వచ్చి ఆ ఉద్యోగిని పరిశీలించగా.. అతడి ప్యాంట్​లో టీ షర్టుల​ వ్యవహారం బయటపడింది.

North Indian was caught while trying to steal 100 T-shirts by hiding in his body - video goes viral
ప్యాంట్​లో100 టీ షర్టులను​ దాచాడు.. వీడియో వైరల్​
author img

By

Published : Mar 14, 2020, 12:15 PM IST

ప్యాంట్​లో100 టీ షర్టులను​ దాచాడు.. వీడియో వైరల్​

తమిళనాడు తిరుప్పూర్​లోని గార్మెంట్​ ఫ్యాక్టరీలో ఓ ఉద్యోగి ఎప్పటిలాగే విధులకు వచ్చాడు. కానీ తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం లావుగా కనిపించాడు. ఫ్యాక్టరీ సూపర్​వైజర్​కు అనుమానం వచ్చి అతడి దుస్తులు విప్పమని చెప్పగా.. అతని బండారం బయటపడింది. మొదట ఆ ఉద్యోగి నిరాకరించినా.. వేరే మార్గం లేక వాటిని తొలగించాడు. కర్మాగారంలో ఉత్పత్తి చేసిన సుమారు 100 టీ షర్టులను తన కాళ్లలో దాచిపెట్టాడు ఆ ఉద్యోగి.

టీ షర్టులను స్వస్థలంలో అమ్ముకునేందుకే చోరీ చేసినట్లు తెలిపాడు. ఈ తతంగమంతా అక్కడున్న కొంతమంది తమ చరవాణిలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.