ETV Bharat / bharat

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలిపులి!

చలితో ఉత్తర భారతదేశం వణికిపోతోంది. ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోతున్నాయి. లద్దాఖ్​లోని లేహ్ జిల్లాలో -9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దిల్లీలో ప్రమాదకర వాయుకాలుష్యం ఇంకా కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటం వల్ల మరో 24 గంటల్లో పరిస్థితి మెరుగుపడుతుంది అధికారులు స్పష్టం చేస్తున్నారు.

author img

By

Published : Dec 21, 2019, 10:56 PM IST

North India reels under cold wave, 'harshest winter' period begins in Kashmir
చలితో వణుకుతున్న ఉత్తర భారతం

ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కశ్మీర్​లోయలో అతిస్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే 40 రోజుల 'చిల్లయి కలాన్' సీజన్ ప్రారంభమైంది. ఉత్తర కశ్మీర్​లోని గుల్మార్గ్​లో అత్యల్పంగా -9.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అమర్​నాథ్​ పర్యటకుల బేస్​ క్యాంప్​ అయిన పహల్గావ్​లో 21 సెంటీమీటర్ల మేర హిమపాతం నమోదైంది. కాజీకుండ్​లో 38.5 సెంటీమీటర్ల మంచు కురిసింది. శ్రీనగర్​లో -0.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా లద్దాఖ్​ ప్రాంతంలోని లేహ్ జిల్లాలో -9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత ఉంది.

పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోనూ చలి వణుకు పుట్టిస్తోంది. బఠిండాలో అత్యల్పంగా 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అమృత్​సర్, లూథియానాలో భారీగా పొగమంచు ఏర్పడింది. ఈ ప్రాంతాల్లో వరుసగా 6.6, 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంబాలా, హిసార్, కర్నాల్​లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఛండీఘర్​లో అత్యల్పంగా 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

హిమాచల్​ ప్రదేశ్​ కీలాంగ్ ప్రాంతంలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మనాలీ, చంబా ప్రాంతంలో 9 సెంటీమీటర్ల హిమపాతం కురిసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పడిపోయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

దిల్లీలో ప్రమాదరకంగా గాలి నాణ్యత!

దేశరాజధాని దిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరంగానే ఉంది. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయిలో 418 పాయింట్లుగా నమోదైంది. నగరమంతటా పొగమంచు వాతావరణం ఏర్పడింది. రాజధానిలో అత్యధికంగా 18 డిగ్రీలు, అత్యల్పంగా 9.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణం ఇలాగే కొనసాగితే వచ్చే 24 గంటల్లో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: మలేషియా ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్​

Kalaburagi (Karnataka), Dec 21 (ANI): The security forces took out flag march from Nagareshwar School to Jagat Circle in Kalaburagi on December 21. Companies of paramilitary forces have been deployed in the area to maintain peace as protests against new Citizenship Act gripped the state. While speaking to ANI, Karnataka ADGP Alok Kumar said, "To instill confidence in minds of general public and fear in minds of bad elements, we wanted to have show of force to send right signal to people."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.