ETV Bharat / bharat

దిల్లీలో పౌల్ట్రీ అమ్మకాలపై నిషేధం

దేశంలో క్రమక్రమంగా బర్డ్​ ఫ్లూ వ్యాప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఉత్తర దిల్లీ పురపాలక శాఖ.. పౌల్ట్రీ అమ్మకాలపై నిషేధం విధించింది. జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. అనంతరం.. తూర్పు, దక్షిణ దిల్లీ పురపాలక శాఖలు కూడా ఇవే ఉత్తర్వులను జారీ చేశాయి.

North Corporation bans sale
బర్ట్​ఫ్లూ భయాలు- దిల్లీలో పౌల్ట్రీ అమ్మకాలపై నిషేధం
author img

By

Published : Jan 13, 2021, 4:03 PM IST

Updated : Jan 13, 2021, 8:28 PM IST

బర్డ్​ఫ్లూ వ్యాప్తితో దిల్లీ అప్రమత్తమైంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఉత్తర దిల్లీలో పౌల్ట్రీ అమ్మకాలు, నిల్వపై నిషేధం విధించాయి ఉత్తర, దక్షిణ, తూర్పు దిల్లీ మున్సిపల్​ కౌన్సిల్​లు. ప్రజాప్రయోజనం కోసమే ఈ ఉత్తర్వులు జారీ చేశామని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించాయి.

గుడ్డు సంబంధిత ఆహార పదార్థాలు సహా ఇతర మాంసాహారం అతిథులకు అందిస్తే హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించాయి. మాంసాహార ఉత్పత్తులకు దూరంగా ఉండాలని పేర్కొన్నాయి.

దిల్లీలో ఇప్పటికే బర్ట్​ ఫ్లూ నిర్ధరణ అయింది. సంజయ్​ సరస్సులో బాతులు, ఇతర పార్కుల్లో కాకులు మరణించాయి. వాటి నమూనాలను పరిశీలించగా ఏవియన్​ ఇన్​ఫ్యూయెంజా వైరస్​ ఉన్నట్లు సోమవారం నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి: బర్డ్​ ఫ్లూ విసిరిన ఆ రెండు సవాళ్లు

Last Updated : Jan 13, 2021, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.