ETV Bharat / bharat

'ఆ రైళ్లలో స్లీపర్ కోచ్​లన్నీ ఇక ఏసీ బోగీలే'

author img

By

Published : Oct 11, 2020, 7:08 PM IST

Updated : Oct 11, 2020, 8:00 PM IST

గంటకు 130 కి.మీ, అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లలో ఇకపై ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయని భారతీయ రైల్వే తెలిపింది. ఆధునీకరణలో భాగంగా ఈమేరకు మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది.

Non-AC sleeper coaches to be replaced by AC coaches for trains running at 130/160 kmph: Rlys
'ఆ రైళ్లలో స్లీపర్ కోచ్​లు.. ఇకపై ఏసీ బోగీలుగా మార్పు'

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వేర్వేరు మార్గాల్లో గంటకు 130/160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లలో.. స్లీపర్​ కోచ్​లు అన్నింటినీ ఏసీ కోచ్​లుగా మార్చనుంది. అయితే.. ప్రయాణికులకు సరసమైన ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ప్రస్తుతం అనేక మార్గాల్లో ఎక్స్​ప్రెస్​ రైళ్లు గంటకు 110కి.మీ లేదా అంతకంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాయి. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం​ రైళ్లు మాత్రం 120 కి.మీ వేగంతో తిరుగుతున్నాయి. అయితే.. వీటి వేగ సామర్థ్యం మరింత పెంచేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని సంబంధిత ప్రతినిధి డీజే నారాయణ్​​ తెలిపారు. వాటికి అనుగుణంగా ఆయా రైళ్లకు సాంకేతికంగా ఏసీ కోచ్​లు అమర్చడం అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు.

రైల్వే నెట్​వర్క్​ను అప్​గ్రేడ్(ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించడం, ఇతర సౌకర్యాలను పెంచడం)​ చేసే ఈ ప్రణాళికపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు నారాయణ్​​. ప్రస్తుతం 83 రైళ్లలో ఈ ప్రక్రియ చేపట్టారని.. ఈ ఏడాదిలోగా 100, వచ్చే సంవత్సరంలో 200 కోచ్​లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

అయితే.. 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తోన్న రైళ్లలో నాన్​-ఏసీ బోగీలు యథాతథంగా ఉంటాయని నారాయణ్​​ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో రూ.17లక్షలకు అమ్ముడైన జత ఎడ్లు!

Last Updated : Oct 11, 2020, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.