ఎస్ బ్యాంకుపై మారటోరియం విధించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 'ఇకపై ఎస్ బ్యాంకు ఉండదని' (నో ఎస్ బ్యాంకు), ప్రధాని మోదీ తన ఆలోచనలతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
-
No Yes Bank.
— Rahul Gandhi (@RahulGandhi) March 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Modi and his ideas have destroyed India’s economy.
#NoBank
">No Yes Bank.
— Rahul Gandhi (@RahulGandhi) March 6, 2020
Modi and his ideas have destroyed India’s economy.
#NoBankNo Yes Bank.
— Rahul Gandhi (@RahulGandhi) March 6, 2020
Modi and his ideas have destroyed India’s economy.
#NoBank
మీ సామర్థ్యం ఏమిటో తెలిసిపోయింది.
కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కూడా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎస్ బ్యాంకు మారటోరియంతో, 'ఆర్థిక సంస్థలను పాలించే, నియంత్రించే ప్రభుత్వ సామర్థ్యం ఏమిటో బహిర్గతమైంది' అని అన్నారు.
"భాజపా ఆరేళ్లుగా అధికారంలో ఉంది. దీనితో ఆర్థిక సంస్థలను పరిపాలించే, నియంత్రించే వారి సామర్థ్యం బహిర్గతమైంది. మొదట పీఎమ్సీ బ్యాంకు... ఇప్పుడు ఎస్ బ్యాంకు నాశనమయ్యాయి. ప్రభుత్వం దీనిపై ఆందోళన చెందుతోందా? లేదా తన బాధ్యతను విస్మరించగలదా? తరువాత ఇదే మార్గంలో మరో బ్యాంకు ఉందా?" - పి.చిదంబరం, మాజీ ఆర్థికమంత్రి
ఇదీ చూడండి:బంగారం భగభగ-రూ.45 వేలు దాటిన 10 గ్రాముల ధర