కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరిగే అవకాశం కనిపించడం లేదు. రైతుల ఆందోళన నేపథ్యంలో వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహిచాలని కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి కేంద్రానికి లేఖ రాశారు. రాసిన లేఖకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం ఈ మేరకు తెలిపింది.
కరోనా కారణంగా ఈసారి శీతాకాల సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని అధీర్ రంజన్ చౌదరికి రాసిన ప్రత్యుత్తరంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పష్టం చేశారు. తాను అనధికారికంగా వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సంప్రదింపులు జరిపానని.. వారు కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారని ప్రహ్లాద్ జోషి లేఖలో పేర్కొన్నారు. శీతాకాలంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని దిల్లీపై ఆ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చూడండి: 'నిరసన చేస్తే దేశద్రోహులు.. వారేమో స్నేహితులు'