ETV Bharat / bharat

దేశంలో 4 కోట్లు దాటిన కరోనా పరీక్షలు - COVID-19 news

దేశంలో కరోనా పరీక్షల సంఖ్య 4 కోట్ల మార్కును దాటింది. దేశవ్యాప్తంగా రోజుకు 9 లక్షలకుపైగా నమూనాలు పరీక్షిస్తున్న నేపథ్యంలో ఈ మైలురాయిని అందుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ప్రతి 10 లక్షల మందికి పరీక్షల సంఖ్య 29,280కి చేరినట్లు పేర్కొంది.

COVID-19 tests crosses 4-crore
దేశంలో 4 కోట్ల మార్కు దాటిన కరోనా పరీక్షలు
author img

By

Published : Aug 29, 2020, 3:08 PM IST

దేశంలో వరుసగా మూడో రోజు 9 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 4 కోట్ల మార్కును దాటింది. ప్రతి 10 లక్ష మందిలో పరీక్షల సంఖ్య 29 వేల దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమన్వయంతో, సమర్థవంతంగా చేపట్టిన చర్యలతోనే ఇది సాధ్యమైనట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 4,04,06,609 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది.

" ప్రతి పది లక్షల మందిలో 29,280 మందికి పరీక్షలు నిర్వహించాం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్షలు పెరిగిన క్రమంలో పాజిటివిటీ రేటు తగ్గుతోంది. దేశ పాజిటివిటీ రేటు 8.57 శాతంగా ఉంది. అది క్రమంగా తగ్గుతోంది.

- కేంద్ర ఆరోగ్య శాఖ.

జనవరిలో పుణెలోని ల్యాబులో తొలి పరీక్ష నిర్వహించారు. తర్వాత దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి.. ఇప్పటివరకు నాలుగు కోట్ల నమూనాలను పరీక్షించారు. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి మొత్తం 1576 ల్యాబుల్లో కరోనా పరీక్షలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా పంజా: కొత్తగా 76,472 కేసులు, 1021 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.