ETV Bharat / bharat

భారత్​ భేరి: ఆ ఘనత సిక్కింకే సొంతం

author img

By

Published : Apr 7, 2019, 6:20 AM IST

Updated : Apr 7, 2019, 9:35 AM IST

ఒకే వ్యక్తికి అత్యధిక కాలం అధికారం అప్పగించిన ఘనత సిక్కింది. పవన్​ చామ్లింగ్​ను వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిని చేసింది సిక్కిం ఓటరు గణం. ఆ రాష్ట్రానికి మరో ప్రత్యేకత ఉంది. దేశంలో ఇప్పటివరకు ఏ ఒక్క జాతీయ పార్టీకీ పాలనా పగ్గాలు ఇవ్వని రాష్ట్రం సిక్కిం మాత్రమే. ఈసారి పరిస్థితి ఏంటి?

భారత్​ భేరి: ఆ ఘనత సిక్కింకే సొంతం

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో మొదటిసారిగా 1979 ఎన్నికలు జరిగాయి. అప్పటినుంచి.. 2014 ఎన్నికల వరకు ప్రాంతీయ పార్టీలదే అధికారం. ఒక్కసారి కూడా జాతీయ పార్టీలు ప్రభావం చూపలేకపోయాయి. దేశరాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న భాజపా, కాంగ్రెస్​లను దరిదాపుల్లోకీ రానీయకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి ప్రాంతీయ పార్టీలు.

''మేం జాతీయ పార్టీలను విశ్వసించం. సిక్కిం రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే 371(ఎఫ్​) ఆర్టికల్​ రక్షణ కోసం ఇది ముఖ్యం.''

- డిలే బర్ఫుంగ్పా, సిక్కిం నేషనల్​ పీపుల్స్​ పార్టీ అధ్యక్షుడు

పోలింగ్​ తేదీ ఏప్రిల్​ 11
లోక్​సభ స్థానాలు 1
అసెంబ్లీ స్థానాలు 32
ఓటర్లు 4, 23, 325
అధికార పక్షం సిక్కిం డెమొక్రటిక్​ ఫ్రంట్​
ప్రధాన ప్రత్యర్థి సిక్కిం క్రాంతికారి మోర్చా

ఇక్కడ భాజపా కంటే కాంగ్రెస్​ కొద్దిగా మెరుగు. 2004, 09 ఎన్నికల్లో జాతీయ పార్టీ భాజపాకు 0.34, 0.78 శాతం ఓట్లు పోలయ్యాయి. ఒక్క స్థానమూ గెలుపొందలేదు. కాంగ్రెస్​కు ఓటు శాతం 20 దాటినా 2004లో వచ్చింది ఒకే ఒక్క సీటు. 2009లో అదీ లేదు. 32 శాసనసభ నియోజకవర్గాల్లోనూ సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్​దే విజయం.

2014 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ధాటికి భాజపా, కాంగ్రెస్​ల ఓట్లశాతం మరింత పతనమైంది. ఒక్క చోటా నెగ్గలేదు. కాంగ్రెస్​కు 1.4 శాతం ఓట్లు నమోదయ్యాయి. భాజపా.. కాంగ్రెస్​లో సగం ఓటు శాతం పొందింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు... రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సత్తా ఏంటో.

మూడు సార్లు సీఎం కుర్చీలో భండారీ....

1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలాకాలం ప్రత్యేక రాజ్యంగానే కొనసాగింది సిక్కిం. అనంతరం జరిగిన పరిణామాలతో 1975లో భారత్​లో 22వ రాష్ట్రంగా మారింది.

సిక్కింలో మొట్టమొదటిసారిగా 1979 అక్టోబర్​లో ఎన్నికలు జరిగాయి. నర్​ బహాదుర్​ భండారీ నేతృత్వంలోని సిక్కిం జనతా పరిషద్(ఎస్​జేపీ)​ పూర్తి ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పోటీ చేసిన 31 స్థానాల్లో 16 గెల్చుకుంది. సిక్కిం కాంగ్రెస్​ 11... సిక్కిం ప్రజాతంత్ర కాంగ్రెస్​(ఎస్​పీసీ) 4 స్థానాలకు పరిమితమయ్యాయి. భండారీ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

  • అనంతరం ఎస్​జేపీ కాంగ్రెస్​లో విలీనమైంది. కానీ.. కొద్దికాలానికి సిక్కిం సంగ్రామ్​ పరిషద్​(ఎస్​ఎస్​పీ) అనే మరో కొత్త ప్రాంతీయ పార్టీ స్థాపించారు భండారీ.
  • 1985లోనూ ఎస్​ఎస్​పీ ప్రభంజనం సృష్టించింది. 30 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. 1989 ఎన్నికల్లో ఏకంగా క్లీన్​స్వీప్​ చేసింది. భండారీ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

చామ్లింగ్​ శకం మొదలు....

1990వ దశకంలో భండారీ ప్రజాదరణ మరుగునపడిపోయింది. ఈయన నాయకత్వంపై తిరుగుబాటు చేపట్టిన పవన్​ కుమార్​ చామ్లింగ్​ సిక్కిం డెమోక్రటిక్​ ఫ్రంట్(ఎస్​డీఎఫ్​) పార్టీని స్థాపించారు.

1994 శాసనసభ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఎస్​డీఎఫ్​ మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. చామ్లింగ్​ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. భండారీకి చెందిన ఎస్​ఎస్​పీ 10 స్థానాలకే పరిమితమైంది.

అనంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఎస్​డీఎఫ్​దే ఆధిపత్యం. 1999లో 24 సీట్లలో గెలుపొందిన పార్టీ... 2004లో మొత్తం 32 స్థానాలను కైవసం చేసుకుంది. 09, 14లలో 31, 22 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. చామ్లింగ్​ వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

''ఇక్కడి ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా సిక్కిం డెమోక్రటిక్​ ఫ్రంట్​ చాలా కాలంగా రాష్ట్రంలో అధికారంలో ఉంది. సమైక్య భావజాలంతో.. సిక్కిం ప్రజలకోసం మంచి పాలన అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది.''

- కేటీ గ్యాల్ట్​సెన్​, ఎస్​డీఎఫ్​ ప్రతినిధి

ప్రాంతీయ పార్టీలొస్తూనే ఉన్నాయ్​....

2014 ఎన్నికల్లో కొత్తగా సిక్కిం క్రాంతికారీ మోర్చా ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చింది. ప్రేమ్​ సింగ్​ తమంగ్​(పీఎస్​ గోలే) అధ్యక్షుడు. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకున్నా 10 స్థానాల్లో గెలిచి అధికార పార్టీకి కొంత పోటీనిచ్చింది.

ఈసారి ఇక్కడ స్టార్​ ఫుట్​బాలర్​ భైచుంగ్​ భుటియా హమ్రో సిక్కిం పార్టీ(హెచ్​ఎస్​పీ)ని స్థాపించారు. హెచ్​ఎస్​పీ నుంచి పార్టీ ప్రతినిధి బిరాజ్​ అధికారి... రినాక్​ అసెంబ్లీ స్థానం సహా ఆ రాష్ట్రంలోని ఏకైక లోక్​సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు.

2019 ఎన్నికల్లో జాతీయ పార్టీలు ఎంతమేర ప్రభావం చూపగలవన్నది ఆసక్తికరం.

ఇవీ చూడండి:

భారత్​ భేరి: రికార్డుల కింగ్​ సిక్స్ కొడతారా

ఆస్తి 2జీ స్ప్రెక్టమ్- అప్పులేమో రాష్ట్ర బడ్జెట్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:      
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Dinard - 6 April 2019
++AUDIO AS INCOMING++
1. Italian Foreign Minister Enzo Moavero walking on beachfront
2. SOUNDBITE (Italian) Enzo Moavero, Italian Foreign Minister:
"We spoke about Libya, naturally, in the light of the latest dramatic developments in recent hours. Yesterday, in particular, we made this joint statement that was unanimous after a detailed discussion. This is important because the countries that are present here as part of the G7, there are various that are members of the UN Security Council, and there are others that are directly involved in following things in Libya as Europeans. It is very important that Libya stops all military action that can only increase the level of destabilization, whereas in this country, in the interest of the Libyan people, we must seek a peaceful solution, a stabilization, a political solution that excludes military options. In this sense, we were all in complete agreement and we expressed that in our statement yesterday afternoon."
3. Sailboats and islands
4. SOUNDBITE (English) Enzo Moavero, Italian Foreign Minister:
"I think that the joint press release that we agreed here at the G7 showed that no one is ready to accept any de facto situation accomplished via military action. We do think that the military initiatives are not the best ones to grant peaceful development in Libya and a constructive path forward towards a stabilization of the country."
5. Italian flag
6. SOUNDBITE (Italian) Enzo Moavero, Italian Foreign Minister:
"We spoke about it. The Italian position on Venezuela is pretty clear. We do not recognize the presidential elections as legitimate and so we do not recognize Mr. Nicholas Maduro as legitimate president of Venezuela. And we do recognize the legitimacy of the National Assembly, and as a consequence the various deliberations the National Assembly has made. What is important in Venezuela is that we get to a process that is inclusive and constructive that will lead to new presidential elections in a short period of time. It is an extremely difficult situation, especially in light of the humanitarian emergency which is what is foremost in our hearts, and the interests of the Venezuelan people."
7. Police on horseback on beach
8. German Foreign Minister Heiko Maas walking past
9. EU's top diplomat Federica Mogherini walking past
10. Italian Foreign Minister Enzo Moavero walking away
STORYLINE:
Italian Foreign Minister Enzo Moavero expressed his concern about the situation in Libya on Saturday saying that "no one is ready to accept a de facto situation accomplished by military action."
His comments come after Libyan strongman Khalifa Hifter on Thursday urged his forces to march on Tripoli, the capital of the oil-rich nation currently controlled by a U.N.-backed government.
A showdown between Hifter's army and the militias could plunge Libya into another spasm of violence, possibly the worse since the 2011 civil war that toppled and later killed longtime dictator Moammar Gadhafi.
Speaking at the sidelines of the Group of Seven Foreign Ministers' meeting, Moavero said the G7 nations were in "complete agreement" on the need for a peaceful solution.
Agreement was not as clear on the question of Venezuela where Italy has dragged its feet on joining European allies in recognizing opposition leader Juan Guaido as interim president of Venezuela.
"We spoke about it.  The Italian position on Venezuela is pretty clear," Moavero explained, "What is important in Venezuela is that we get to a process that is inclusive and constructive that will lead to new presidential elections in a short period of time."
Moavero spoke as foreign ministers from the Group of Seven advanced economies wrapped up a two-day meeting in the French seaside resort of Dinard on Saturday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 7, 2019, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.