ETV Bharat / bharat

ఆర్టికల్​ 371ను రద్దు చేసే ప్రసక్తే లేదు: షా - temporary provision

ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 371ను  రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.

ఆర్టికల్​ 371ను రద్దు చేసే ప్రసక్తే లేదు: షా
author img

By

Published : Sep 8, 2019, 5:34 PM IST

Updated : Sep 29, 2019, 9:50 PM IST

ఈశాన్య రాష్ట్రాల మండలి 68వ సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ ప్రాంతాల అభివృద్ధికి నరేంద్ర మోదీ సర్కారు కట్టుబడి ఉందని తెలిపారు. 371వ అధికరణను కేంద్రం రద్దు చేస్తుందంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చారు షా. కొందరు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న అమిత్ షా

"విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. 370 రద్దును వ్యతిరేకించే వారు తమ వైఖరిని తెలిపే స్వేచ్ఛ ఉంది. అదే అదునుగా తీసుకుని ఆర్టికల్​ 371ని కూడా కేంద్రం రద్దు చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను పార్లమెంటులో స్పష్టం చేశాను. తర్వాత తొలిసారి అసోం వచ్చాను. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఇక్కడున్నారు. ఆర్టికల్​ 370, 371 మధ్య అంతరాన్ని వివరిస్తా. ఆర్టికల్​ 370ని రాజ్యాంగంలో తాత్కాలికంగా పొందుపరిచారు. 371 తాత్కాలికం కాదు. శాశ్వతం. ప్రత్యేక ప్రతిపత్తి. మోదీ, భాజపా సర్కారు ఆర్టికల్​ 371ని ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయబోమని స్పష్టం చేస్తున్నా."

-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.

దేశంలోకి అక్రమ వలసదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు అమిత్‌ షా. అసోంలో నిర్ణీత కాలవ్యవధిలో జాతీయ పౌర జాబితాను పూర్తి చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 100రోజుల పాలనపై మోదీకి రాహుల్​ శుభాకాంక్షల పంచ్

Patna (Bihar), Sep 08 (ANI): Minister of State (MoS) for Health and Family Welfare, Ashwini Choubey, on Sep 08 said former prime minister Morarji Desai used to consume cow urine as it "cures" various diseases. Choubey on Sep 07 had said that the Ayush Ministry is deliberating on using cow urine in medicines for curing cancer, asserting that the sacred animal's urine is in itself very powerful. Choubey further said that extensive research is needed to be conducted on the benefits of cow urine.
Last Updated : Sep 29, 2019, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.