ETV Bharat / bharat

బిహార్​లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ సీఎం నితీశేనా?

బిహార్​లో ఎన్డీఏ నాయకత్వంపై ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్​. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ముందంజలో ఉన్న క్రమంలో.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నితీశ్​ కుమార్​ మళ్లీ నేతృత్వం వహిస్తారా? అన్న ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.

Nitish kumar
బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​
author img

By

Published : Nov 10, 2020, 6:38 PM IST

బిహార్​లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ ముందంజలో ఉంది. జేడీయూతో పోలిస్తే.. భాజపా ఆధిక్యంలో ఉండటం వల్ల ప్రస్తుతం కూటమి నాయకత్వంపై చర్చ ప్రారంభమైంది. భాజపా ఎక్కువ స్థానాలు గెలిస్తే.. ముఖ్యమంత్రి పీఠంపై పీటముడి పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో బిహార్​లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే కూటమికి నితీశ్​ కుమారే నేతృత్వం వహిస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సంజయ్​ జైశ్వాల్​. బిహార్​లో ఎన్డీఏ నాయకత్వంపై ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు.

" ఎన్నికలకు చాలా రోజుల ముందే ఈ అంశంపై ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టతనిచ్చారు. బిహార్​ ప్రజలు నిజం ఏది, అబద్ధమేది అనేది తేల్చుకోగల సమర్థులు. "

- సంజయ్​ జైశ్వాల్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.

లెక్కింపు ప్రక్రియ ప్రారంభం సమయంలోనే నితీశ్​ కుమార్​ నేతృత్వంలోనే ఎన్డీఏ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేసింది జేడీయూ. ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు సాధించేందుకు విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేశాయని ఆరోపించారు జేడీయూ అధినేత వశిష్ట నారాయణ్​ సింగ్​. ప్రభుత్వానికి భాజపా లేదా జేడీయూలో ఎవరు నాయకత్వం వహిస్తారని అడిగిన ప్రశ్నకు.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, జేపీ నడ్డాలు పలు సందర్భాల్లో.. స్పష్టంగా వెల్లడించారని తెలిపారు సింగ్​.

ఇదీ చూడండి: బిహార్​లో 'భాజపా' జోరు- ఎన్​డీఏ రయ్​ రయ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.