ETV Bharat / bharat

బూతు సైట్లపై బ్యాన్​ కోసం మోదీకి ముఖ్యమంత్రి లేఖ

author img

By

Published : Dec 17, 2019, 12:29 PM IST

Updated : Dec 17, 2019, 3:57 PM IST

సమాజంలో ఆడవారిపై పెరుగుతున్న లైంగిక వేధింపులకు అశ్లీల వెబ్​సైట్లే కారణమని ఆరోపించారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. తక్షణమే అంతర్జాలంలో ఉన్న ఆ సైట్లను, అనుచిత కంటెంట్​ను నిషేధించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

letter
బూతు చిత్రాలపై మోదీకి లేఖ రాసిన సీఎం

మహిళలపై పెరుగుతున్న లైంగిక నేరాలకు అశ్లీల సైట్లే కారణమని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వెబ్​సైట్లను తక్షణమే నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న అన్ని అశ్లీల సైట్లను, అనుచిత కంటెంట్​ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

" ఆడపిల్లలు, మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన వీడియోలను వాట్సాప్​, ఫేస్​బుక్​ వంటి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. అలాంటి వాటిని చూడటం వల్ల పిల్లలు, యువకుల ఆలోచనలు పాడవుతున్నాయి. మహిళలపై నేరాల రేటు పెరగడానికి ఇవే కారణం.త్వరగా వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను."

- బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​ లేఖ

సదరు వీడియోలు యువకుల మనసులపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయన్నారు నితీశ్​. ఇలాంటి అశ్లీల సైట్లపై ఉక్కుపాదం మోపడానికి సమాచార 'సాంకేతిక చట్టం- 2000'లో సవరణలు చేసినప్పటికీ...ఈ సమస్యను పరిష్కరించడానికి అవి సమర్థంగా లేవని అభిప్రాయపడ్డారు బిహార్ సీఎం.

ఈ విషయంపై సుప్రీం కోర్టు పలు మార్గదర్శకాలను ఇచ్చినట్లు ప్రస్తావించారు నితీశ్. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కఠిన ఆదేశాలు జారీ చేయాలని.. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

ఇదీ చూడండి : 'లోక్​సభ సభ్యుల సంఖ్య 1000కి పెంచాలి'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Dec 17, 2019, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.