ETV Bharat / bharat

10 లక్షల ఉద్యోగాల హామీపై ముఖ్యమంత్రి ఎగతాళి! - బిహార్ ఎన్నికలు 2020

బిహార్​లో ఎన్నికల ప్రచార పర్వాన్ని అధికార జేడీయూ ప్రారంభించింది. పార్టీ కార్యకర్తలతో వర్చువల్​గా మాట్లాడిన సీఎం నితీశ్ కుమార్​.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాగానే 10 లక్షల ఉద్యోగాలకు ఆమోదం తెలుపుతామని ఆర్​జేడీ హామీపై ఎగతాళి చేశారు నితీశ్.

bihar
నితీశ్ కుమార్​
author img

By

Published : Oct 12, 2020, 10:18 PM IST

బిహార్​లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం నితీశ్ కుమార్​.. ఆర్​జేడీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదటి కేబినెట్​ భేటీలోనే 10 లక్షల ఉద్యోగాలను ఆమోదిస్తామన్న హామీపై ఎగతాళి చేశారు.

వర్చువల్​గా 11 నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన నితీశ్​.. ఆర్​జేడీ పేరు వాడకుండా విపక్షాలంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా 2005 నుంచి తమ ప్రభుత్వం సాధించిన విజయాలను నితీశ్​ ప్రస్తావించారు.

అంతకుముందు వాళ్లు అధికారంలో ఉన్న 15 ఏళ్లలో కేబినెట్ సమావేశాలను సరిగా నిర్వహించారా? అని ప్రశ్నించారు. బిహార్​లో 1990 నుంచి 2005 వరకు ఆర్​జేడీ అధికారంలో ఉంది.

మహాకూటమి అధికారంలోని వస్తే తొలి కేబినెట్ భేటీలోనే 10 లక్షల ఉద్యోగ నియామకాలను ఆమోదం తెలుపుతామని ఆర్​జేడీ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ ఇటీవల ప్రకటించారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: వర్చువల్​ ర్యాలీలతో నితీశ్​ ప్రచార బాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.