బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మరోసారి జేడీయూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నామినేషన్ వేసే సమయం ఆదివారం ముగిసినటప్పటికీ నితీశ్ ఒక్కరే బరిలో ఉన్నారు. ఫలితంగా ఎన్నిక ఏకగ్రీవం అయ్యిందని పార్టీ జాతీయ రిటర్నింగ్ అధికారి అనీల్ హెగ్డే ఆదివారం ప్రకటించారు.
వచ్చే ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో పార్టీ అధ్యక్షుడిగా నితీశ్‌కుమార్‌ను మరోసారి ఎన్నుకుంది జేడీయూ. ప్రస్తుతం భాజపా, జేడీయూ మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పొత్తు నిలిచే అవకాశం కష్టమే.
మిత్రపక్షం నుంచే విమర్శలు
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌తో సహా భాజపాలోని ఓ వర్గం నాయకులు.. నితీశ్‌కుమార్ నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు. బిహార్ వరదలు విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయంలో వీరు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
భాజపా ఎమ్మెల్సీ సంజయ్ పాసవాన్ అయితే నితీశ్‌కుమార్‌ను తొలగించి, కాషాయ పార్టీ నేతకు ప్రభుత్వ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: బ్యాంకులకు వరుస సెలవులు.. ఇప్పుడే చూసుకోండి..!