బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను ఆకర్షించేందుకు వివిధ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికల సమరానికి తగ్గట్టుగానే అధికార జేడీయూ కూడా ప్రజలపై హమీల వర్షం కురిపిస్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఇప్పటికే 7 తీర్మానాలను ప్రజల ముందు ప్రవేశపెట్టారు. తాజాగా.. '7 నిశ్చయ్ పార్ట్-2' పేరుతో మరో ట్వీట్ చేశారు.
బిహార్ ప్రజలకు సేవ చేయడమే తన ధర్మమని పేర్కొన్నారు నితీశ్. ప్రజల ఆశీస్సులతో.. తన హామీలను నెరవేర్చగలుగుతానని.. తద్వారా బిహార్ రాష్ట్రం స్వావలంబన వైపు అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నితీశ్ హామీలు..
- ఐటీఐ, పాలిటెక్నిక్ సంస్థల్లో నైపుణ్య శిక్షణను అందించేందుకు ఓ కేంద్రాన్ని ఏర్పాటు. ఉద్యోగాలు పొందే విధంగా శిక్షణ అందించేందుకు జిల్లా స్థాయిలో 'మెగా స్కిల్ సెంటర్' నిర్మాణం.
- కొత్త వ్యాపారాలను ప్రోత్సహించేందుకు రూ. 3లక్షల వరకు 50శాతం గ్రాంట్లు అందజేత. రూ. 7లక్షల రుణాలకు 7శాతం గ్రాంట్లు మంజూరు. ప్రాజెక్టు వ్యయంలో 50శాతం లేదా రూ. 5లక్షల గ్రాంట్లు, రూ. 5లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేత.
- నారీ శక్తిని పెంపొందించేందుకు.. 12వ తరగతి ఉత్తీర్ణులయ్యే వారికి రూ. 25వేలు, డిగ్రీ పాస్ అయ్యేవారికి రూ. 50వేల ఆర్థిక సహాయం అందివ్వడం.
- స్థానిక పాలన, పోలీసు, జిల్లా స్థాయి కార్యాలయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపొందించేందుకు చర్యలు.
- పంట పొలాల్లోకి నీరు పంపించేందుకు అన్ని విధాలుగా రైతులకు సహాయం. సౌర దీపాలు, ఘన-ద్రవ వ్యర్థాల నిర్వహణ కోసం ప్లాంట్లు, ప్రతి ఇంటికీ నీటి కుళాయి, మరుగుదొడ్లు నిర్మాణం.
- రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడం కోసం నగరాలు, ఇతర ప్రదేశాల్లో రోడ్ల నిర్మాణం. ప్రజారోగ్య వ్యవస్థ మెరుగుదలకు చర్యలు.
ఇవీ చూడండి:-