రఫేల్ వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భాజపా డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టులో సమర్పించిన ప్రమాణపత్రం ద్వారా ప్రధానిపై, రఫేల్ ఒప్పందంపై అసత్య ఆరోపణలు చేసినట్లు రాహుల్ అంగీకరించారని కమలదళం విమర్శించింది.
"రాహుల్ గాంధీ విశ్వసనీయత ఇప్పటికే దెబ్బతింటోంది. ఆయన విశ్వనీయత కోల్పోతున్నారు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు అసత్యం మాట్లాడటం, ఆపైన విచారం వ్యక్తం చేయటం అలవాటుగా మారింది. కాంగ్రెస్ లాంటి ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడైన రాహుల్ గాంధీ అబద్ధాలపై ఆధారపడటం శోచనీయం."
- నిర్మలా సీతారామన్, రక్షణమంత్రి
ఇదీ చూడండి: 'ఉగ్రవాదం పట్ల వైఖరిలో మార్పు సుస్పష్టం'