దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్యా కేసులో దోషులకు ఈనెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలు కానుంది. దోషులను ఉరి తీయడానికి ఇంకా ఐదు రోజులు ఉండగా మూడు రోజుల ముందే రిపోర్టు చేయాలని తిహార్ జైలు అధికారులు తలారికి లేఖ రాశారు.
నిర్భయ కేసులో దోషులైన ముకేశ్ కుమార్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్(31)లను ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాల్సి ఉంది.
శిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు న్యాయపరమైన అన్ని అవకాశాలు వాడుకోవడం వల్ల ఇప్పటికే మూడు సార్లు శిక్ష వాయిదా పడింది. దోషులకు అన్ని మార్గాలు మూసుకుపోగా తాజాగా వారికి డెత్ వారెంట్ జారీ చేసింది దిల్లీ కోర్టు.
చివరిసారిగా...
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తలారి పవన్ తిహార్ చేరుకున్న తర్వాత ఉరిశిక్షపై ట్రైల్స్ నిర్వహిస్తారు. ప్రస్తుతం దోషులకు ప్రతిరోజు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. నలుగురు దోషుల్లో ముకేశ్, పవన్, వినయ్ వారి కుటుంబ సభ్యులతో చివరిసారి మాట్లాడారు. అక్షయ్‌ను తన కుటుంబంతో త్వరలోనే మాట్లాడిస్తారు.
ఇదీ చదవండి: రామజన్మ భూమిలో తొలిసారి హారతి దర్శనం ఆ రోజే