నిర్భయ దోషులలో ఒకడైన ముకేశ్ కుమార్... రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు తిహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు.
2012లో దిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార కేసులో నలుగురు దోషులకు దిల్లీ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ నెల 22న ఉరిశిక్ష అమలు కానున్న నేపథ్యంలో చివరి అవకాశంగా క్షమాభిక్ష ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముకేశ్ కుమార్‌తో పాటు దోషులుగా తేలిన పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లకు వేసిన ఉరిశిక్ష జనవరి 22న ఉదయం 7 గంటలకు అమలు కానుంది.