ETV Bharat / bharat

న్యాయం గెలిచింది.. మహిళా భద్రతే ముఖ్యం: మోదీ - నిర్భయ దోషులకు ఉరి

nirbhaya
నిర్భయ కేసు
author img

By

Published : Mar 20, 2020, 4:56 AM IST

Updated : Mar 20, 2020, 11:28 AM IST

11:22 March 20

  • Justice has prevailed.

    It is of utmost importance to ensure dignity and safety of women.

    Our Nari Shakti has excelled in every field. Together, we have to build a nation where the focus is on women empowerment, where there is emphasis on equality and opportunity.

    — Narendra Modi (@narendramodi) March 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

న్యాయం గెలిచింది...

నిర్భయ దోషుల ఉరితో న్యాయం గెలిచిందని ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు.

న్యాయం గెలిచింది. సమాజంలో మహిళలకు భద్రత, గౌరవం ఇవ్వడం అత్యంత ముఖ్యం. మన స్త్రీశక్తి ప్రతి రంగంలోనూ ప్రతిభ కనబరచింది. మనమందరం కలసి మహిళా సాధికారత, సమానత్వం, దేశాభివృద్ధి కోసం పని చేయాలి. - నరేంద్ర మోదీ, ప్రధాని

09:01 March 20

అందరూ ప్రతిజ్ఞ చేయాలి: కేజ్రీవాల్‌ 

"బాధితులకు న్యాయం జరగడానికి దాదాపు ఏడు సంవత్సరాల కాలం పట్టింది. నిర్భయ వంటి ఘటనలు పునరావృతం కాకుండా అందరూ ప్రతిజ్ఞ చేయాలి. ఇటీవల ఈ దోషులు చట్టాన్ని ఎలా తప్పుదోవ పట్టించారో అందరూ చూశారు. ఇంకా మన వ్యవస్థలో ఇలాంటివి లోటుపాట్లు చాలా ఉన్నాయి. వాటిని మెరుగు పరచాల్సిన అవసరం ఉంది"

- అరవింద్‌ కేజ్రీవాల్‌, దిల్లీ ముఖ్యమంత్రి

08:57 March 20

శిక్ష తప్పదు... 

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకావడంపై జాతీయ మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​ ఆనందం వ్యక్తం చేశారు.

సమయం, తేదీ మారుతుందేమో కానీ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. ఆలస్యమైనా శిక్ష మాత్రం అనుభవిస్తారని తప్పు చేయాలనుకునేవాళ్లు గుర్తుపెట్టుకోవాలి. నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలే దీనికి ఉదాహరణ. - రేఖా శర్మ, జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌

08:46 March 20

మృతదేహాల తరలింపు...

నిర్భయ దోషుల మృతదేహాలను పంచనామా కోసం తిహార్​ జైలు నుంచి డీడీయూ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. 

08:09 March 20

సంబరాలు...

నిర్భయ దోషులను ఉరితీసినందుకు ఉత్తర్​ప్రదేశ్​ బల్లియా గ్రామ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈ రోజు ఉదయం నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. 

06:45 March 20

దోషులు మరణించినట్లు వైద్యుడి ప్రకటన

నిర్భయ కేసులో దోషులకు ఉరి విధించిన అనంతరం వైద్యుడు పరిశీలించారు. నలుగురు దోషులూ మృతి చెందారని ప్రకటించారు.  

06:33 March 20

తిహార్​ జైలు ఎదుట సంబురాలు

నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలైన తర్వాత తిహార్ జైలు ఎదుట ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మహిళ హక్కుల కార్యకర్త యోగితా భయానా అక్కడివారికి మిఠాయిలు పంచారు. 

06:16 March 20

  • #WATCH Asha Devi, mother of 2012 Delhi gang rape victim says, "As soon as I returned from Supreme Court, I hugged the picture of my daughter and said today you got justice". pic.twitter.com/OKXnS3iwLr

    — ANI (@ANI) March 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ రోజు న్యాయం లభించింది..

దోషులకు ఉరి శిక్ష అమలయ్యాక నిర్భయ తల్లి ఆశా దేవి సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల న్యాయపోరాటం తర్వాత వాళ్లకు ఉరి పడిందన్నారు. న్యాయం లభించిన ఈ రోజును భారత బిడ్డలకు అంకితమిచ్చారు. న్యాయవ్యవస్థ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.  

"నా కూతురు ఇప్పుడు లేదు. మళ్లీ తిరిగిరాదు. మా నుంచి తను వెళ్లిపోయాక మేం పోరాటం మొదలుపెట్టాం. అది ఆమె కోసం కాదు.. ఆమె లాంటి అనేక మంది ఆడబిడ్డలకోసం. సుప్రీంకోర్టు నుంచి రాగానే.. నా కూతురు ఫొటోను హత్తుకున్నాను. చివరికి నీకు న్యాయం లభించిందని చెప్పాను."

- ఆశాదేవి, నిర్భయ తల్లి

05:39 March 20

శిక్ష అమలు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది.నలుగురు మానవమృగాలు ఉరికంభానికి వేలాడారు. తెల్లవారు జామున ఐదున్నర గంటలకు..తిహార్​ జైళ్లో తలారీ పవన్ జల్లాద్.. నలుగురు దోషులకు శిక్ష అమలు చేశారు. 

05:19 March 20

  • Delhi: Security deployed outside Tihar jail, where the four 2012 Delhi gang-rape death row convicts will be hanged shortly. pic.twitter.com/QxyQi0XnWD

    — ANI (@ANI) March 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆ గదిలోకి దోషులు

నలురుగు దోషులను ఉరి వేసే గదికి అధికారులు తీసుకెళ్లారు. మరికొద్ది నిమిషాల్లో మరణశిక్ష అమలు చేయనున్నారు.  

ఉరి శిక్ష అమలు నేపథ్యంలో జైలు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.  

05:15 March 20

తిహార్ జైలు ఎదుట గుమిగూడిన ప్రజలు

నిర్భయ దోషులను ఉరి శిక్ష అమలు చేస్తోన్న తిహార్ జైలుకు వందలాది మంది ప్రజలు చేరుకున్నారు. కొంతమంది న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు.  

05:02 March 20

  • Tihar jail officials to ANI: Medical of all four death row convicts completed, all are fit and fine. Jail to be under lock-down till the process of hanging is completed. https://t.co/7xyjs4E1FS

వైద్య పరీక్షలు పూర్తి

ఉరి శిక్ష విధించే ముందు దోషులకు వైద్య పరీక్షలు నిర్వహించారు జైలు అధికారులు. నలుగురు దోషులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఉరి ప్రక్రియ ముగిసేంత వరకు జైలును లాక్​డౌన్​ చేస్తున్నట్లు తెలిపారు.

04:58 March 20

ఏర్పాట్లు పూర్తి  

నిర్భయ దోషులకు ఉరి విధించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తిహార్ జైలు అధికారులు. తలారిని నిద్రలేపారు. ఉరి సంబంధించి విధివిధానాలపై జైలు అధికారులు సమావేశమయ్యారు.  

04:44 March 20

మరికాసేపట్లో నిర్భయ దోషులకు ఉరి.. 

2012లో దేశ రాజధాని నడిబొడ్డున సంచలనం రేకెత్తించిన 'నిర్భయ' అత్యాచారం, హత్య ఘటన బాధితురాలికి న్యాయం జరిగే సమయం ఆసన్నమైంది. ఉరి శిక్షను ఆపేందుకు దోషులు చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నలుగురు దోషులను రేపు ఉదయం 5.30 గంటలకు దిల్లీ తిహార్​ జైల్లో ఉరి తీయనున్నారు. వారు శ్వాస తీసుకునేది మరికొన్ని గడియలు మాత్రమే. మరికాసేపట్లో దోషుల ప్రాణాలు గాల్లో కలవనున్నాయి.

ముకేశ్​ సింగ్​(32), పవన్​ గుప్తా(25), వినయ్​ శర్మ(26), అక్షయ్​ కుమార్​ సింగ్​(31) నలుగురిని ఒకేసారి ఉరి తీయనున్నారు. మార్చి 20న ఉరి తీయాలని 15 రోజుల కిందటే దిల్లీ ట్రయల్​ కోర్టు డెత్​ వారెంట్​ జారీ చేసింది. ఈ మేరకు దిల్లీ తిహార్​ కారాగారంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జైలు సిబ్బంది.

ఈ రోజంతా హైడ్రామా...

చివరి నిమిషంలో నిర్భయ దోషులకు చుక్కెదురయింది. ఉరిపై స్టేను నిరాకరించిన దిల్లీ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ముగ్గురు దోషులు దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. 

దోషుల పిటిషన్​పై అర్ధరాత్రి విచారణకు స్వీకరించింది జస్టిస్​ మన్మోహన్​, జస్టిస్ సంజీవ్​ నరూలా ధర్మాసనం. వ్యాజ్యంలో సరైన వివరాలు చేర్చలేదని చెబుతూ తిరస్కరించింది. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించినా నిరాశ తప్పలేదు. పవన్​ క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించటాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

నిన్న జరిగిన పరిణామాలు..

ఉరి అమలుపై స్టే విధించాలని దోషులు అక్షయ్, పవన్​, వినయ్​ దాఖలు చేసిన  పిటిషన్​ను దిల్లీ పటియాలా హౌస్ కోర్టు గురువారం తిరస్కరించింది. ఉరి శిక్షను ఆపేందుకు ఆఖరి రోజున విశ్వప్రయత్నాలు చేశారు నిర్భయ దోషులు. వేర్వేరు సాకులతో దిల్లీ కోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్లు అన్నింటినీ న్యాయస్థానాలు కొట్టివేశాయి.

దోషులు అక్షయ్​ కుమార్​, పవన్​ గుప్తా, వినయ్​ శర్మ తమ ఉరి శిక్షపై స్టే విధించాలనంటూ దిల్లీ కోర్టును ఆశ్రయించగా.. అడిషనల్​ సెషన్స్​ జడ్జి ధర్మేంద్ర రాణా నేతృత్వంలోని ధర్మాసనం వారి పిటిషన్​ను కొట్టివేసింది.

పవన్​ గుప్తా రెండోసారి వేసిన క్యురేటివ్​ పిటిషన్​నూ సుప్రీం కోర్టు కొట్టివేసింది. దోషి అక్షయ్​ రెండోసారి దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్​ చేస్తూ వేసిన వ్యాజ్యాన్ని కూడా సుప్రీం కొట్టివేసింది. జస్టిస్​ భానుమతి, జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఏఎస్​ బోపన్నల ధర్మాసనం... పిటిషన్​ను విచారించదగ్గ అర్హత లేదని తేల్చిచెప్పింది.

అక్షయ్​ తొలుత జనవరి 29న, అనంతరం.. మార్చి 18న క్షమాభిక్ష పిటిషన్​ దాఖలు చేశాడు. ఈ రెండూ తిరస్కరణకు గురయ్యాయి. అంతకు ముందు, నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను దిల్లీలోనే లేనంటూ నలుగురు దోషుల్లో ఒకరైన ముకేశ్‌ సింగ్‌ అభ్యర్థననూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఇప్పటికి 3 సార్లు వాయిదా...

నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు చేయాలని తొలుత దిల్లీ కోర్టు 2 నెలల కిందటే డెత్​ వారెంట్​ జారీ చేసింది. అయితే.. వారికున్న న్యాయపరమైన అవకాశాలను ఒక్కొక్కరుగా వాడుకుంటూ మరణ శిక్షను ఆలస్యం చేసే ప్రయత్నాలు చేశారు. ఈ మధ్యలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఒకరి తర్వాత ఒకరు క్యురేటివ్​ పిటిషన్​, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్​, సుప్రీం కోర్టులో సవాల్​.. వాటి తిరస్కరణల తర్వాత రెండోసారి పిటిషన్లు, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇలా దాదాపు 2 నెలలు జాప్యం చేశారు. ఎట్టకేలకు వారి అవకాశాలన్నీ ముగిసినందున ఉరిశిక్షకు మార్గం సుగమమైంది.

ఇదీ వాయిదాల పర్వం...

నలుగురు దోషులను 2020 జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాల్సిందిగా దిల్లీ కోర్టు జనవరి 7న ఆదేశాలు జారీచేసింది. దోషుల వివిధ పిటిషన్లు పెండింగ్​లో ఉన్నందున జనవరి 22న శిక్ష అమలు కష్టమని దిల్లీ ప్రభుత్వం తెలపగా 2020 ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలు చేయాలని 2020 జనవరి 17న దిల్లీ కోర్టు డెత్‌వారెంట్లు జారీచేసింది.

తర్వాత ఫిబ్రవరి 1న శిక్ష అమలుకు ఇచ్చిన డెత్‌వారెంట్లు నిలిపివేస్తూ జనవరి 31న దిల్లీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. నలుగురు దోషులకు మార్చి 3న మరణదండన అమలు చేయాలని 2020 ఫిబ్రవరి 17న దిల్లీ కోర్టు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేసింది.

చివరగా నిర్భయ దోషులకు న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిన కారణంగా.. మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని దిల్లీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత కూడా.. దోషులు మరణదండన తప్పించుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నారు. అయినప్పటికీ రేపు ఉదయం ఉరి శిక్ష తథ్యం కానుంది.

ఇదీ కేసు...

2012 డిసెంబరు 16 రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో కదిలే బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్‌ కావడం వల్ల మూడేళ్ల శిక్ష పడింది. మరో దోషి రాంసింగ్ తిహార్​​ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ దిల్లీ ట్రయల్​ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దోషులు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని 2019 జులై 9న కొట్టివేసింది.

Last Updated : Mar 20, 2020, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.