నిర్భయ కేసు నిందితుడు వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ విషయమై తాజాగా అతడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓ దరఖాస్తు చేసుకున్నాడు. తన పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్‌ను తక్షణమే వెనక్కి పంపాలని పేర్కొన్నాడు. హోంశాఖ పంపిన పిటిషన్‌ను తాను దాఖలు చేయలేదని, దానిపై సంతకం కూడా చేయలేదన్నాడు.
వినయ్ శర్మ పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్‌ను దిల్లీ ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ పిటిషన్ కేంద్ర హోంశాఖకు చేరింది. శుక్రవారం వినయ్ శర్మ దస్త్రాన్ని రాష్ట్రపతికి పంపిన హోంశాఖ.. అతడి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని పిటిషన్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు తాను క్షమాభిక్ష కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని వినయ్ శర్మ చెబుతుండటం గమనార్హం.
ఇదీ చూడండి : కేంద్ర హోంశాఖ వద్దకు నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్