నిర్భయ కేసులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం విచారించనుంది సుప్రీంకోర్టు. నిర్భయ దోషుల ఉరిశిక్షపై స్టేను ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్రం వ్యాజ్యం దాఖలు చేసింది.
ఈ వ్యాజ్యాన్ని అత్యవసర విచారణకు స్వీకరించాలని అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ కోరారు. కేంద్రం అభ్యర్థనను పరిశీలించిన సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. రేపు విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
దిల్లీ హైకోర్టు స్టే కారణంగా దోషులకు మరణశిక్ష అమలు చేయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. దోషుల రివ్యూ పిటిషన్లతోపాటు ముగ్గురికి సంబంధించిన క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లూ తిరస్కరణకు గురైనా.. జైలు అధికారులు వారికి ఉరి అమలు చేయలేకపోతున్నారని నటరాజన్ కోర్టుకు విన్నవించారు.
ఇదీ చూడండి: నిర్భయ కేసు: సుప్రీంకోర్టులో కేంద్రం వ్యాజ్యం